బంజారాహిల్స్ రెయిన్బో చిల్డ్రన్స్ హార్ట్ ఇనిస్ట్యూట్ ఆస్పత్రిలో శనివారం మహేష్ బాబు కాంబినేషన్ లిటిల్ హార్ట్స్ ఫౌండేషన్ సంయుక్తంగా కలిసి అప్పుడే పుట్టే చిన్నారులు లేదా నూతనంగా జన్మించిన చిన్నారుల్లో గుండె సంబంధిత వ్యాధులకు చికిత్సకు జరిగే వ్యయాన్ని ఈ ఫౌండేషన్ ద్వారా అందించి వారి ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో తోడ్పాటు అందిస్తుందని తెలిపారు.మొదటిగా ఆసుపత్రి వైద్యులు చైర్మన్ కే రమేష్, నాగేశ్వరరావులతో కలిసి మహేష్ బాబు జ్యోతి ప్రజ్వలన చేశారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ముఖ్య అతిథిగా విచ్చేసిన హీరో మహేష్ బాబు మాట్లాడుతూ… చిన్నపిల్లల అంటే అందరికీ ఇష్టం అందులో తనకు ప్రత్యేకంగా పిల్లలంటే ఇష్టం అన్నారు.ఊహ తెలియని చిన్నపిల్లల్లో ఏర్పడే వ్యాధులను అరికట్టేందుకు చేసిన శస్త్రచికిత్సకు సహకారం అందిస్తూ 125 మంది చిన్నారులకు తమ ఫౌండేషన్ ద్వారా సహకారములు అందించమని తెలిపారు.
రాబోయే రోజుల్లో నిరుపేద కుటుంబంలో జన్మించిన చిన్నారులకు ఎవరికైనా భయంకరమైన వ్యాధులు గుండె సంబంధిత వ్యాధులు ఉన్నాయని తెలిస్తే తమ ఫౌండేషన్ ద్వారా వారికి చికిత్స అందించి ఆ చిన్నారుల చిరునవ్వులను రాబోయే తరానికి పరిచయం చేయడమే లక్ష్యంగా ఫౌండేషన్ పని చేస్తుందని వివరించారు.

డా”కంచర్ల రమేష్ రెడ్డి రెయిన్ బో గుండె సంబంధిత చికిత్స కేంద్ర ఆసుపత్రి సీఈఓ మాట్లాడుతూ… భారతదేశంలో ఏ వైద్య కేంద్రం అందించినటువంటి వైద్య సదుపాయాలను మేటిగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి రెయిన్ బో ఆసుపత్రి అందిస్తుందని ఆయన తెలిపారు.చిన్నారుల ఆరోగ్య పరిరక్షణలో చిత్తశుద్ధితో పనిచేస్తున్న వైద్య కేంద్రంలో ఒకటిగా రెయిన్ బో ఆసుపత్రి ఉందని చెప్పారు.లిటిల్ హార్ట్స్ ఫౌండేషన్ ప్రారంభించిన సమయంలోనే తన సొంత గా కోటి రూపాయలు అందజేసి ప్రతి సంవత్సరం 50 లక్షల చొప్పున ఐదు సంవత్సరాలు అందిస్తున్నట్లు ఆయన ప్రకటించారు.

సీనియర్ పిడియాట్రిక్ కార్డియాలజిస్ట్ డా”నాగేశ్వరరావు మాట్లాడుతూ… గర్భంకు ముందు గర్భం తర్వాత ప్రతి వెయ్యి మందిలో పదిమంది చిన్నారులకు గుండె సంబంధిత వ్యాధులు ఉన్నాయన్నారు.హృదయ ఫౌండేషన్ ద్వారా అనేకమంది చిన్నారులకు సహకారం అందించిన తాము గతంలోనే అబ్దుల్ కలాం సహకారంతో నిరుపేద కుటుంబాల పిల్లలకు ప్రసూతి కాక ముందే మనదేశంలో గుండె సంబంధిత శస్త్ర చికిత్సలనూ పది సంవత్సరాల క్రితం నిర్వహించమన్నరు.ఇటువంటి చికిత్స భారత దేశంలో రెయిన్ బో ఆసుపత్రిలోనే మొట్టమొదటిసారిగా అందించడం జరిగిందనీ తెలిపారు.

డా”రామ చందర్, ప్రత్యేకంగా ఒక పాటను రచించి పాట ద్వారా ఈ విషయాన్ని బహిర్గతం చేశారు.హరిణి, సాయి చరణ్లు కలిసి పాట పాడారు.పుట్టుకతో గుండె సంబంధిత వ్యాధితో బాధపడేవారికి రెయిన్ బో ఆసుపత్రి అండగా ఉంటుందనీ తెలియజేస్తూ చేయి చేయి కలిపి చిన్నారులకు చేయుతనిద్ధం.
చిరుగుండెకు చిరు సహకారన్నినందిద్దం.చిరు హృదయాలను చిరయదలను చేద్దాం.
మేటి వాసుతులతో రెయిన్బో హాస్పిటల్లో చికిత్స అందిస్తున్నారని పాట పాడారు.
లోగోలో ఉన్నటువంటి… నీలిరంగు చెడు రక్తం ఎర్ర రంగు మంచి రక్తనికి సూచిక అన్నారు.
ఫోటో రైటప్ చిన్నారులకు బహుమతులు… 7 సంవత్సరలా కేతన్, కుంచి, జునైన్, చిన్నారులకు స్వయంగా మహేష్ బాబు పౌండేషన్ ద్వారా చికిత్స అందించి పునర్జన్మ అందించిన వైద్యులు వైద్య బృందంతో కలిసి స్టేజిపై బహుమతులు అందజేశారు.చికిత్స వ్యయం ప్రస్తుతం ఆసుపత్రిలో 45 వేల ఇతర దేశాల్లో 3 లక్షలు ఇటువంటి చికిత్సలో తీసుకునే కొన్ని ప్రక్రియలకు జరిగే ఏ ఖర్చు.
ఈ కార్యక్రమంలో మహేష్బాబు పౌండేషన్ వ్యవస్థాపకురాలు నమ్రత మహేష్, లిటిల్ హార్ట్స్ ఫౌండేషన్ చైర్మన్ సి.ఎస్.రావు, ఆసుపత్రి వైద్య బృందం సిబ్బంది తదితరులు భాగస్వాములయ్యారు.