తెలుగు బుల్లితెరపై 1000 కంటే ఎక్కువసార్లు ప్రసారమైన మూవీ ఇదే.. మహేష్ కే ఈ ఘనత సొంతమంటూ?

టాలీవుడ్ సినీ అభిమానులు ఏదైనా సినిమా నచ్చితే ఆ సినిమాను మళ్లీ మళ్లీ చూడటానికి ఆసక్తి చూపిస్తుంటారు.

మహేష్ బాబు( Mahesh Babu ) సినీ కెరీర్ లోని చాలా సినిమాలు బుల్లితెరపై మంచి రేటింగ్ ను సొంతం చేసుకుని ఆకట్టుకున్నాయి.

అతడు మూవీ శాటిలైట్ హక్కులు ప్రముఖ ఎంటర్టైన్మెంట్ ఛానెల్స్ లో ఒకటైన స్టార్ మా దగ్గర ఉన్నాయి.స్టార్ మా ఛానల్ లో అతడు మూవీ చాలాసార్లు టెలీకాస్ట్ అయిన సంగతి తెలిసిందే.

2020 సంవత్సరం సమయానికే స్టార్ మా, మా మూవీస్ ఛానల్స్ లో అతడు మూవీ 1350 సార్లు ప్రసారమైంది.2023 ఆగష్టు నాటికి ఈ కౌంట్ 1500 దాటినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు.తెలుగు బుల్లితెరపై ఈ సినిమా తప్ప మరే సినిమా 1000 కంటే ఎక్కువసార్లు ప్రదర్శితం కాలేదట.

భవిష్యత్తులో అతడు మూవీ( Athadu Movie ) 2000 మార్కును దాటినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం అయితే లేదని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.మహేష్ కు మాత్రమే ఈ తరహా రికార్డులు సొంతమని, సాధ్యమని ఫ్యాన్స్ చెబుతున్నారు.

Advertisement

స్టార్ మా ఛానల్( Star Maa Channel ) మొదట అతడు మూవీ శాటిలైట్ హక్కులను కొన్ని సంవత్సరాలకు మాత్రమే కొనుగోలు చేసింది.అయితే ఈ సినిమా రేటింగ్స్ విషయంలో టాప్ లో నిలుస్తుండటంతో శాటిలైట్ హక్కులను రెన్యువల్ చేయించుకుంది.

అతడు మూవీ క్రియేట్ చేసిన రికార్డును భవిష్యత్తులో సైతం మరే సినిమా బ్రేక్ చేయలేదు.

మహేష్ తన సినిమాలతో ఆ సినిమాలు సాధించిన రికార్డులతో బాక్సాఫీస్ ను షేక్ చేస్తున్నారు.మహేష్ బాబు నిదానంగా సినిమాల్లో నటిస్తున్నా క్వాలిటీ సినిమాలలో నటిస్తున్నారు.మహేష్ బాబు రేంజ్ మరింత పెరగాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు.

అతి త్వరలో మహేష్ గుంటూరు కారం( Guntur Karam ) షూట్ తో మళ్లీ బిజీ కానున్నారు.ఈ సినిమాలో మహేష్ కు జోడీగా మెయిన్ హీరోయిన్ గా శ్రీలీల నటిస్తుండగా మీనాక్షి చౌదరి మరో హీరోయిన్ గా నటిస్తున్నారు.

అల్లు, మెగా ఫ్యామిలీలు కలిసిపోయినట్టేనా.. ఈ కుటుంబాల మధ్య గ్యాప్ తగ్గుతుందా?
Advertisement

తాజా వార్తలు