మళ్లీ విదేశాలకు వెళుతున్న సూపర్ స్టార్ మహేష్ బాబు.. కారణమేంటంటే?

సూపర్ స్టార్ మహేష్ బాబు ఒకే సమయంలో ఎక్కువ సంఖ్యలో సినిమాలు చేయడం కంటే ఒక సినిమా చేయడానికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారనే సంగతి తెలిసిందే.మహేష్ బాబు నటించిన సర్కారు వారి పాట సినిమా సక్సెస్ సాధించినా ఆ సినిమా మహేష్ రేంజ్ సక్సెస్ సాధించలేదనే సంగతి తెలిసిందే.

 Super Star Mahesh Babu Again Went To Foreign Details Here , Foreign Trip, Mahesh-TeluguStop.com

కొన్నిరోజుల క్రితం మహేష్ తల్లి మృతి చెందగా ఆ బాధ నుంచి మహేష్ బాబు ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారు.

మహేష్ త్రివిక్రమ్ కాంబో మూవీకి సంబంధించి ఇప్పటికే ఒక షెడ్యూల్ షూటింగ్ పూర్తైంది.

మహేష్ బాబు మళ్లీ విదేశాలకు వెళుతున్నారని తెలుస్తోంది.మహేష్ ఒక్కరే విదేశాలకు వెళుతున్నారని మెడికల్ కన్సల్టింగ్ పనుల కోసం మహేష్ అక్కడికి వెళుతున్నారని బోగట్టా.విదేశాల నుంచి తిరిగొచ్చిన వెంటనే మహేష్ త్రివిక్రమ్ కాంబో మూవీ షూట్ మొదలుకానుంది.2023 సంవత్సరం ఏప్రిల్ 28వ తేదీన ఈ సినిమా థియేటర్లలో రిలీజ్ కానుందనే సంగతి తెలిసిందే.

మహేష్ బాబుకు ఇండస్ట్రీ హిట్ ఇవ్వాలనే ఆలోచనతో ఈ సినిమా స్క్రిప్ట్ విషయంలో త్రివిక్రమ్ ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నారు.వరుసగా తన సినిమాలలో పూజా హెగ్డేను హీరోయిన్ గా ఎంపిక చేస్తున్న త్రివిక్రమ్ ఈ సినిమాలో కూడా పూజా హెగ్డేకు ఛాన్స్ ఇచ్చారనే సంగతి తెలిసిందే.

ఖలేజా సినిమా బాక్సాఫీస్ వద్ద కమర్షియల్ గా ఫ్లాప్ కావడంతో త్రివిక్రమ్ మహేష్ కు కెరీర్ బెస్ట్ హిట్ ఇవ్వాలని భావిస్తున్నారు.

Telugu Foreign Trip, Mahesh Babu, Maheshtrivikram, Medical, Pooja Hegde, Sitara,

మహేష్ బాబు, త్రివిక్రమ్ ఈ సినిమా కోసం కెరీర్ హైయెస్ట్ రెమ్యునరేషన్లను తీసుకున్నారని తెలుస్తోంది.ఈ సినిమాలో సితార కీలక పాత్రలో కనిపిస్తారని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది.చెప్పిన డేట్ కు ఈ సినిమా రిలీజ్ కావడం కష్టమని ప్రచారం జరుగుతుండగా మేకర్స్ ఏం చేస్తారో చూడాల్సి ఉంది.

ఏ మాత్రం గ్యాప్ దొరికినా మహేష్ బాబు విదేశాలకు వెళ్లడానికి ఆసక్తి చూపిస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube