అడ్వాన్స్ వెయ్యి ఇచ్చి ఆ సినిమాకు సంతకం పెట్టమన్నారు: హీరో కృష్ణ

టాలీవుడ్ సీనియర్ హీరో అయిన కృష్ణ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.తెలుగు సినీ ఇండస్ట్రీలో ప్రయోగాలకు కేరాఫ్ అడ్రస్ గా సూపర్ స్టార్ కృష్ణ నిలిచిన విషయం తెలిసిందే.

 Super Star Krishna Interacting With Daughter Manjula Shares Interesting Things Details Super Star Krishna, Tollywood, Manjula Ghattamaneni, Latest Interview, Super Star Krishna Interview, Gudhachari 116 Movie, Mahesh Babu, Super Star Krishna Birthday-TeluguStop.com

మొదటగా తేనెమనసులు సినిమాతో సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన కృష్ణ ఆ తర్వాత ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్ సినిమాలలో నటించి తెలుగు సినీ ఇండస్ట్రీలో టాప్ హీరోగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఏర్పరచుకున్నారు.కౌబాయ్, జేమ్స్ బాండ్ లాంటి హీరో పాత్రలను తెలుగు ఆడియన్స్ కి పరిచయం చేసిన హీరో కృష్ణ.

అంతేకాకుండా సాంఘిక, జానపద, పౌరాణిక చిత్రాల్లో కూడా నటించి లక్షలాది మంది ప్రేక్షకుల మనసులలో స్థానం సంపాదించుకున్నారు.ఇది ఇలా ఉంటే ఈ మే 31న కృష్ణ పుట్టినరోజు సందర్భంగా ఆయన ఫ్యాన్స్‌కు గిఫ్ట్ ఇచ్చేందుకు కూతురు మంజుల ఘట్టమనేని రెడీ అయింది.

 Super Star Krishna Interacting With Daughter Manjula Shares Interesting Things Details Super Star Krishna, Tollywood, Manjula Ghattamaneni, Latest Interview, Super Star Krishna Interview, Gudhachari 116 Movie, Mahesh Babu, Super Star Krishna Birthday-అడ్వాన్స్ వెయ్యి ఇచ్చి ఆ సినిమాకు సంతకం పెట్టమన్నారు: హీరో కృష్ణ-,Top Story-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఈ క్రమంలోనే ఆమె సొంతంగా నిర్వహిస్తున్న యూట్యూబ్ ఛానెల్‌లో కృష్ణను ఇంటర్వ్యూ చేసింది.ఆ వీడియోలో కృష్ణ ఆరోగ్యం పై వచ్చిన వార్తలకు చెక్ పెట్టేసింది మంజుల.

అయితే అందుకు సంబంధించిన పూర్తి వీడియోని మే 31న విడుదల చేయబోతున్నట్లు తెలిపింది.ఈ సందర్భంగా కృష్ణ మాట్లాడుతూ.ప్రస్తుతం తాను ఇంట్లోనే ఉంటూ రెస్టు తీసుకుంటున్నాడట.

అంతేకాకుండా ఆ దేవుడి దయతో తన స్కిన్ ఇంకా మెరుస్తూనే ఉంది అని చెప్పుకొచ్చారు కృష్ణ.తాను పని పాట లేకుండా బయటకు వెళ్లడం లేదని తెలిపారు.అప్పుడు మంజుల హీరో అవ్వాలని ఐడియా ఎక్కడి నుంచి వచ్చింది.? ఎలా వచ్చింది.? అని మంజుల ప్రశ్నించగా.తాను సినిమా హీరో అవ్వాలని ఏ ఉద్యోగం చేయలేదని,నువ్వు ఇంకా చిన్నపిల్లోడిలానే ఉన్నావు.ఓ రెండేళ్లు డ్రామేటిక్‌గా ఎక్స్‌పీరియన్స్ చేయు.కచ్చితంగా ఛాన్స్ ఇస్తాం.

నువ్వు హీరో అవుతావు అని అన్నారు.మేము ఓ పిక్చర్ తీయాలని అనుకుంటున్నాం.గూఢచారి 116 అందులో నువ్వే హీరో.

ఇదిగో అడ్వాన్స్ అంటూ వెయ్యి రూపాయలు ఇచ్చి కాంట్రాక్ట్ మీద సంతకం పెట్టు.అని అన్నారని అలాంటి విషయాలను పంచుకున్నారు కృష్ణ.

అయితే తనకు పిల్లలంటే ఎంతో ఇష్టం అని, అందుకే సినిమాలను ఫ్యామిలీని బ్యాలెన్స్ చేస్తూ చేయగలిగాను అని చెప్పుకొచ్చారు కృష్ణ.ఇందుకు సంబంధించిన ప్రోమో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube