టాలీవుడ్ సూపర్ స్టార్ కృష్ణ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు.ఎన్నో అద్భుతమైన సినిమాల్లో నటించి టాలీవుడ్ ఇండస్ట్రీలో గొప్ప నటుడిగా పేరు పొందిన కృష్ణ ప్రస్తుతం వయసు పైబడటంతో సినిమాలకు దూరంగా ఉంటున్నారు.
ఇకపోతే ఆయన సినీ కెరియర్ లో జరిగిన కొన్ని సంఘటనలను అనుభవాలను ప్రతి ఒక్కరూ తెలుసుకోవడం కోసం ఆయన కూతురు మంజుల సొంతంగా ఒక యూట్యూబ్ ఛానల్ నిర్వహించి తన తండ్రిని ఇంటర్వ్యూ చేశారు.ఈ క్రమంలోనే ఈ ఇంటర్వ్యూ ద్వారా ఎన్నో ఆసక్తికరమైన విషయాలను అభిమానులకు తెలియజేశారు.
ఈ క్రమంలోనే సూపర్ స్టార్ కృష్ణ వారసుడిగా మహేష్ బాబు ఇండస్ట్రీలో అగ్ర హీరోగా కొనసాగుతున్నారు.అయితే మహేష్ బాబుని ఇండస్ట్రీకి ఏవిధంగా తీసుకువచ్చారనే విషయం గురించి కృష్ణ ఆసక్తికరమైన సమాధానాలు తెలియజేశారు.
చిన్నప్పుడే మహేష్ బాబుని సూపర్ స్టార్ ను చేశారు.మీరు ప్లాన్ చేసుకొని చేశారా? లేదా అలా జరిగిపోయిందా అంటూ మంజుల ప్రశ్నించగా కృష్ణ ఆసక్తికరమైన సమాధానం చెప్పారు.
మహేష్ బాబును చిన్నప్పుడు ఒక రోజు నాతో పాటు షూటింగ్ కి తీసుకెళ్ళాను.షూటింగ్ జరుగుతున్న సమయంలో మహేష్ బాబు ఎక్కడో మూలన ఉన్న మెట్లపై కూర్చుని గడ్డం కింద చేతులు పెట్టుకుని షూటింగ్ చూస్తున్నారు.నేను వెళ్లి నటిస్తావా అని అడిగితే నేను చేయను అంటూ మారాం చేశాడు.చేస్తావా? చెయ్యవా? అని అనడంతో మహేష్ అక్కడి నుంచి లేచి స్టూడియో మొత్తం పరుగులు పెట్టించాడు అంటూ కృష్ణ తెలిపారు.కేవలం నటిస్తావా అన్నందుకే నన్ను పరుగులు పెట్టించాడని తెలిపారు.