గాల్లోంచి.. చుక్క, ముక్క..ఎక్కడో తెలుసా?

ఎడారిలో ఎక్కడ చూసినా నీటి జాడ కనపడదు.ఇక ఆహారం గురించి అయితే ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.

 Switzerland Scientists Developed Technology To Make Protein Food And Water From-TeluguStop.com

ఎందరో ఎడారిలో దారితప్పి నీరు, ఆహారం లేక మరణించిన వారు కూడా ఉన్నారు.కానీ అలాంటి ఎడారి మధ్యలో ఉన్నా సరే, వారికి తినడానికి మటన్‌ లాంటి ఫుడ్డు, కావల్సినన్ని నీళ్లు ఉన్నాయి.

వీటిని బయట నుండి తేలేదు.అక్కడే గాల్లో నుండే వాటిని తయారు చేశారు.

ఆశ్చర్యపోతున్నారా.అవును శాస్త్రవేత్తలు నిజంగానే గాల్లోంచి ప్రోటీన్‌ ఫుడ్‌ను, నీళ్లను తయారు చేసే టెక్నాలజీలను అభివృద్ధి చేశారు.

చుక్క నీటి కోసం కటకటలాడే ప్రదేశాల్లో ఏమాత్రం ఖర్చు లేకుండా గాలి నుంచి నీటిని తీసే పరికరాన్ని స్విట్జర్లాండ్‌లోని ఈటీహెచ్‌ జ్యూరిక్‌ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. ‘సెల్ఫ్‌ కూలింగ్‌ కండెన్సేషన్‌ (తానంతట తానే చల్లబర్చుకుంటూ.

గాలిలోని నీటి ఆవిరిని సంగ్రహించే)’సాంకేతికతతో ఈ పరికరం పనిచేస్తుంది.పది చదరపు మీటర్ల పరిమాణమున్న పరికరంతో రోజుకు 12.7 లీటర్ల నీళ్లు ఉత్పత్తి అవుతాయని పరిశోధనకు నేతృత్వం వహించిన శాస్త్రవేత్త ఇవాన్‌ హెక్లర్‌ తెలిపారు.తాము తయారు చేసిన పరికరానికి ఎలాంటి అదనపు ఖర్చు అవసరం లేదని.పైగా రోజులో 24 గంటలూ నీటిని పొందవచ్చని ఈటీహెచ్‌ జ్యూరిక్‌ శాస్త్రవేత్తలు చెప్తున్నారు.

గాల్లో నుండి మాంసం.!

Telugu Drop, Nonveg, Protein, Switzerland, Latest, Air-Latest News - Telugu

గాల్లో నుండి మటన్, చికెన్ వంటి ప్రోటీన్ ఫుడ్ కూడా వచ్చే మార్గాన్ని శాస్త్రవేత్తలు కనిపెట్టారు.అంగారకుడు, ఇతర గ్రహాలపై ఉన్న వాతావరణం నుంచి ప్రోటీన్లను ఉత్పత్తి చేయగలిగితే.వ్యోమగాములకు ఆహారం సమస్య తీరుతుందనేది దీని ఉద్దేశం.వివిధ పద్ధతుల్లో గాలిలోని వాయువులు, మూలకాలను సేకరించి, అవసరమైన మేర సమ్మిళితం చేసి.‘ఎయిర్‌ ప్రోటీన్‌’ను రూపొందించారు.దానిని శుద్ధిచేసి, పూర్తిగా ఆరబెట్టి.

ఒక పిండి వంటి పదార్థంగా తయారు చేశారు.ఈ ‘ఎయిర్‌ ప్రోటీన్‌’పిండితో.

చికెన్, మటన్, ఫిష్‌ వంటి వివిధ రకాల మాంసం తరహాలో తయారు చేశారు.తమ ‘ఎయిర్‌ ప్రొటీన్‌’రుచి, పోషకాల విషయంలో సాధారణ మాంసంతో సమానమని.

యాంటీ బయాటిక్స్, పురుగు మందుల అవశేషాలూ ఉండవని శాస్త్రవేత్తలు చెప్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube