బాన పొట్టను కరిగించుకునేందుకు ప్రయత్నిస్తున్నారా.. అయితే మీ డైట్ లో ఇది ఉండాల్సిందే!

బాన పొట్ట( Stomach ).కోట్లాది మందిని కలవర పెడుతున్న సమస్య ఇది.

స్త్రీ పురుషులు అనే తేడా లేకుండా ఎంతో మంది బాన పొట్ట సమస్యతో తీవ్రంగా బాధపడుతున్నారు.ఈ క్రమంలోనే బాన పొట్టను కరిగించుకునేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు.

మీరు ఈ జాబితాలో ఉన్నారా.? అయితే కచ్చితంగా ఇప్పుడు చెప్పబోయే జ్యూస్ మీ డైట్ లో ఉండాల్సిందే.ఈ జ్యూస్ పొట్ట కొవ్వును కరిగించడానికి చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది.

మరి ఇంకెందుకు లేటు బాన పొట్టను మాయం చేసే ఆ జ్యూస్ ను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం పదండి.ముందుగా ఒక పైనాపిల్ తీసుకుని ఉప్పు నీటిలో శుభ్రంగా కడగాలి.

Advertisement

ఆపై పైనాపిల్ తొక్కను( Peel the pineapple ) చెక్కేసి ముక్కలుగా కట్ చేసుకోవాలి.అలాగే ఒక కీర దోసకాయ( Cucumber ) కూడా తీసుకుని స్లైసెస్ మాదిరి కట్ చేసుకోవాలి.

ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని అందులో ఒక గ్లాస్ వాటర్ పోయాలి.వాటర్ హీట్ అవ్వగానే చెక్కేసి పెట్టిన పైనాపిల్ తొక్కల‌ను వేసి ఎనిమిది నుంచి పది నిమిషాల పాటు మరిగించాలి.

ఆపై స్టవ్ ఆఫ్ చేసి వాటర్ ను ఫిల్టర్ చేసుకోవాలి.

ఇప్పుడు బ్లెండర్ తీసుకుని అందులో కట్ చేసి పెట్టుకున్న పైనాపిల్ ముక్కలు, కీరా స్లైసెస్, మూడు ఫ్రెష్ పాల‌కూర‌ల ఆకులు( Lettuce leaves ) మరియు వన్ టేబుల్ స్పూన్ అల్లం ముక్క‌లు వేసుకోవాలి.అలాగే పైనాపిల్ పీల్ వాటర్ ను కూడా పోసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.ఇలా గ్రైండ్ చేసుకున్న మిశ్రమం నుంచి స్టైనర్ సహాయంతో జ్యూస్ ను సపరేట్ చేసుకోవాలి.

నార్త్ ఈస్ట్ ఇండియన్‌ని దారుణంగా గేలి చేసిన పిల్లలు.. కలకలం రేపుతోన్న వైరల్ వీడియో..
హమ్మయ్య! అల్లు అర్జున్ కి ఓ గండం గట్టెక్కింది... ఇక ఎంచక్కా అక్కడికి చెక్కేయొచ్చు!

ఈ జ్యూస్ లో వన్ టేబుల్ స్పూన్ లెమన్ జ్యూస్ మిక్స్ చేసి సేవించాలి.

Advertisement

రోజుకు ఒక గ్లాస్ ఈ పైనాపిల్ కీర పాల‌కూర‌ జ్యూస్ ను తీసుకుంటే పొట్ట ఎంత లావుగా ఉన్నా సరే కొద్ది రోజుల్లోనే సన్నగా నాజూగ్గా మారుతుంది.పొట్ట వద్ద పేరుకుపోయిన కొవ్వు దెబ్బకు కరిగిపోతుంది.కాబట్టి బాన పొట్టతో బాధపడుతున్న వారు తప్పకుండా ఈ జ్యూస్ ను డైట్ లో చేర్చుకునేందుకు ప్రయత్నించండి.

తాజా వార్తలు