అడల్ట్ స్టార్ సన్నీ లియోన్ గతం ఎలాగున్నా ఇప్పుడు తానొక మారిపోయిన మనిషి.పోర్న్ ఇండస్ట్రీని వదిలేసి 2012 నుంచి బాలివుడ్ సినిమాలు తీయడం మొదలుపెట్టిన సన్నీ, ఆ తరువాత మళ్ళి పోర్న్ ఫిలిమ్స్ చేయలేదు.
మీడియాతో పలుమార్లు ఇకనుంచి పూర్తిగా సినిమాలకే అంకితమైనట్టు ప్రకటించింది కుడా.అయినా సరే, సన్నీ మీద రోజుకో గాస్సిప్ మీడియాలో హల్ చల్ చేస్తూనే ఉంటుంది.
సన్నీ ఎప్పుడు వాటిని సీరియస్ తీసుకోకుండా ఖండిస్తూనే ఉంది.
తాజాగా ఒక ఇంటర్వ్యులో మాతృత్వంపై స్పందించింది సన్నీ.” నేను బయటి ప్రపంచానికి ఏ రకంగా తెలిసినా, నా ప్రపంచంలో నేనొక బాధ్యతగల భార్యనే.నా భర్త డానియేల్ వెబర్ అంటే నాకు చాలా ఇష్టం.
నా జీవితంలోని ప్రతి ఘట్టంలో నాకు అండగా నిలిచాడు తను.మాకు పిల్లల్ని కనాలని ఉంది.నేను అందరిలాంటి మహిళనే.నాకూ అమ్మని కావాలని ఉంటుందిగా.కాని ఇప్పుడప్పుడే తల్లిని కావాలని అనుకోవట్లేదు.ప్రస్తుతం నాకంటూ ఒక కెరీర్ ఉంది.
నన్ను నేను నటిగా నిరూపించుకోవాలి.ఆ తరువాతే పిల్లల గురించి ఆలోచిస్తా.” అంటూ తన మనసులోని మాటను బయటపెట్టింది సన్నీ.
సన్నీ లియోన్ ప్రస్తుతం నటిస్తున్న చిత్రం మస్తిజాదే.
జనవరి 29, 2016 న ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
.






