బాలీవుడ్, టాలీవుడ్ ఇండస్ట్రీలలో ఊహించని రేంజ్ లో ఫ్యాన్ ఫాలోయింగ్ ను కలిగి ఉన్న సన్నీ లియోన్ వయస్సు పెరుగుతున్నా వరుస ఆఫర్లతో బిజీ అవుతూ ఇతర నటీమణులకు షాకిస్తున్నారు.అయితే సన్నీ లియోన్ తనకు 20 సంవత్సరాల వయస్సులో ఎదురైన చేదు అనుభవం గురించి మాట్లాడుతూ షాకింగ్ విషయాలను వెల్లడించగా ఆ విషయాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన కొత్తలో తనకు బెదిరింపు కాల్స్ వచ్చాయని సన్నీ లియోన్ అన్నారు.కొంతమంది చెంపేస్తామని చెబుతూ నాకు బెదిరింపు కాల్స్ చేసేవారని సన్నీ లియోన్ కామెంట్లు చేశారు.
ఈ మెసేజ్ లలో ఎక్కువ మెసేజ్ లు భారత్ నుంచి వచ్చినవే అని ఆమె చెప్పుకొచ్చారు.ఆ సందేశాల వల్ల భారతదేశంలోని ప్రజలు నాపై కోపంగా ఉన్నారని నాకు అర్థమైందని సన్నీ లియోన్ కామెంట్లు చేశారు.

ఆ బెదిరింపుల వల్ల నేను చాలా భయాందోళనకు గురయ్యానని ఆమె అన్నారు.అప్పుడు నా వయస్సు 20 సంవత్సరాలు అని ఆ సమయంలో నాకు మంచి ఏదో చెడు ఏదో తెలియదని సన్నీ లియోన్ పేర్కొన్నారు.ఆ సమయంలో నాకు ఏ విధంగా చేస్తే మంచిదో చెప్పేవారు కూడా లేరని సన్నీ లియోన్ కామెంట్లు చేశారు.అదే పరిస్థితి ఇప్పుడు ఎదురైతే నేను ఎక్కువగా ఎఫెక్ట్ కానని సన్నీ లియోన్ అన్నారు.

ప్రస్తుతం నేను మానసికంగా స్ట్రాంగ్ గా ఉన్నానని సన్నీలియోన్ చెప్పుకొచ్చారు.సన్నీ లియోన్ వెల్లడించిన విషయాలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.సన్నీ లియోన్ ఈ ఏడాది జిన్నా సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు.జిన్నా సినిమా బాక్సాఫీస్ వద్ద అశించిన ఫలితాన్ని సొంతం చేసుకోలేదు.రాబోయే రోజుల్లో సన్నీ లియోన్ టాలీవుడ్ ఆఫర్లతో బిజీ అవుతారేమో చూడాల్సి ఉంది.







