టాలీవుడ్ హీరో మంచు విష్ణు హీరోగా నటించిన తాజా చిత్రం జిన్నా.ఈ సినిమాలో సన్నీలియోన్, పాయల్ రాజ్ పుత్ లు హీరోయిన్ లుగా నటించిన విషయం తెలిసిందే.
ఇది ఇలా ఉంటే ఈ సినిమా నేడు అనగా అక్టోబర్ 21న నాలుగు భాషల్లో విడుదల కానుంది.ఈ సినిమా విడుదలకు ముందు సినిమా ప్రమోషన్స్ లో భాగంగా మీడియాతో ముచ్చటించారు హీరో మంచు విష్ణు.
ఈ నేపథ్యంలోనే మీడియా అడిగిన ఎన్నో ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు.ఈ సందర్భంగా సన్నిలియోన్ కి సంబంధించిన ఒక ప్రశ్న అడగగా ఆ ప్రశ్నకు విష్ణు చెప్పిన సమాధానం ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది.
సన్నీ లియోనీకి పూర్తి పాత్ర ఇవ్వడం పై మీ ఆలోచన ఏంటి? అని ప్రశ్నించగా.
ఆ ప్రశ్నకు విష్ణు స్పందిస్తూ.
ముందు నేను కూడా భయపడ్డాను.కానీ సన్నీకి ఓ మెసెజ్ పెట్టాను.
అది సేవ్ చేసుకోమని చెప్పాను.జిన్నా సినిమా విడుదల అయ్యాక యాక్టర్‌గా నీ కెరీర్ మారుతుందని చెప్పాను.
నీ గురించి చాలా కాలం మాట్లాడుకుంటారని చెప్పాను అని తెలిపారు హీరో మంచి విష్ణు. ఒకవేళ నేను ఈ రోజు చెప్పింది నిజం కాకపోతే,మీరు ఇకపై నన్ను నమ్మరు.
అయినప్పటికీ ఇంత కాన్ఫిడెంట్‌గా చెబుతున్నాను, ఈ సినిమాలో నా నంబర్ ఐదో ఆరో ఉంటుంది.మా అమ్మా, పిల్లల్ని సినిమాకు తీసుకెళ్లగలనా? నవ్వించగలనా? అనే ఉద్దేశంతోనే సినిమాలు చేయాలనే ధోరణితో ఉన్నాను అని చెప్పుకొచ్చారు మంచి విష్ణు.

ఈ సందర్భంగా మంచు విష్ణు మాట్లాడిన మాటలను బట్టి చూస్తే సన్నీలియోన్ కి జిన్నా సినిమాలో ఎంత ముఖ్యమైన పాత్రను ఇచ్చారు అన్నది మంచి విష్ణు మాటల్లోనే అర్థమవుతోంది.మరి జిన్నా సినిమాపై భారీ అంచనాలు పెట్టుకున్న మంచు విష్ణు కి ఈ సినిమా ఏ రేంజ్ లో సక్సెస్ను అందిస్తుందో చూడాలి మరి.అంతేకాకుండా ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా గత కొద్ది రోజులుగా పాయల్, సన్నీ లియోన్, మంచు విష్ణు పలు ప్రధాన నగరాలను సందర్శించిన విషయం తెలిసిందే.కాగా విష్ణు అంత గట్టిగా చెప్పిన మాట ఈ సినిమా విడుదలైన తరవాత ప్రేక్షకులు అంటారా లేదో చూడాలి మరి.







