తెలంగాణ రాష్ట్రంలో మోస్ట్ పాపులర్ రాజకీయ నాయకురాల్లలో సునీత లక్ష్మారెడ్డి ( Sunitha Lakshmareddy ) కూడా ఒకరు.ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీలో మంత్రి పదవి కూడా చేపట్టారు.
ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత సునీత లక్ష్మారెడ్డి రెండుసార్లు నరసాపురం ( Narasapuram ) నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయారు.ఆ తర్వాత బీఆర్ఎస్ లో చేరిన ఆమెకు కెసిఆర్ సముచిత స్థానం కల్పించారు.
తెలంగాణ మహిళా కమిషన్ చైర్ పర్సన్ పదవి ఆమెకు అప్పగించారు.ఇన్నాళ్లు ఆ పదవిలో కొనసాగిన ఆమె సడన్ గా ఆ పదవికి రాజీనామా చేసింది.
దీనికి కారణాలు ఏంటో తెలుసుకుందాం.
ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో రాజకీయాలు ( politics )వేడెక్కాయి.ఎప్పుడు ఏ నేత ఏ పార్టీలోకి జంప్ అవుతున్నాడో తెలియడం కష్టంగా ఉంది.వారి రాజకీయ భవిష్యత్తు కోసం అనేక మంతనాలు జరుపుతూ ముందుకు సాగుతున్నారు.
ఆ విధంగా సునితా లక్ష్మారెడ్డి కూడా తన రాజకీయ భవిష్యత్తు కోసం కీలకమైన పదవికి రాజీనామా చేసింది.అయితే సునీత లక్ష్మారెడ్డి నర్సాపూర్ నియోజకవర్గ నుంచి గతంలో రెండుసార్లు పోటీ చేసి ఓడిపోయింది.
ఆ నియోజకవర్గంలో ఎలాగైనా గెలవాలని గట్టిగా కసరత్తు చేస్తోంది.అందుకోసమే మహిళా కమిషన్ చైర్ పర్సన్ పదవికి రాజీనామా చేసింది.అయితే నరసాపూర్ లో మదన్ రెడ్డి ( Madan reddy ) సిట్టింగ్ ఎమ్మెల్యే గా ఉన్నారు.ఆయనను కాదని కేసీఆర్ ఈసారి టికెట్ సునీత లక్ష్మారెడ్డికిచ్చారు.
మదన్ రెడ్డిని బుజ్జగించి ఆయన చేతుల మీదుగానే సునీత లక్ష్మారెడ్డికి బీఫారం అందించేలా చేశారు కేసీఆర్.ఇదే తరుణంలో మహిళా కమిషన్ చైర్ పర్సన్ గా ఉంటే ప్రచారం చేయడం వీలు అవ్వట్లేదని, సునీత లక్ష్మారెడ్డి ఆ పదవికి రాజీనామా చేసి పూర్తిస్థాయిలో ప్రచారంలో మునిగిపోయింది.
గెలుపే లక్ష్యంగా దూసుకుపోతోంది.మరి చూడాలి సునీత లక్ష్మారెడ్డి అక్కడ విజయం సాధిస్తుందా లేదా అనేది డిసెంబర్ 3వ తేదీన తెలుస్తుంది.