కమెడియన్ గా కెరీర్ స్టార్ట్ చేసి తర్వాత ఊహించని విధంగా అందాలరాముడు సినిమాతో హీరోగా అవకాశం అందుకని హిట్ కొట్టిన తర్వాత మర్యాద రామన్న సినిమాతో సూపర్ హిట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు.ఆ సినిమా తర్వాత పూలరంగడు సినిమాతో మరో హిట్ ని ఖాతాలో వేసుకొని కమెడియన్ నుంచి పూర్తిగా హీరోగా సునీల్ టర్న్ తీసుకున్నాడు.
ఇక అప్పటి నుంచి సునీల్ కెరియర్ ఒక్కసారిగా క్రింద పడడం మొదలైంది.హీరోగా సునీల్ చేసిన ప్రతి సినిమా కూడా అ మాగ్జిమం డిజాస్టర్ టాక్ ను అందుకుంది.
దీంతో హీరోగా సక్సెస్ అవ్వాలనుకున్న సునీల్ కెరియర్ కి ఊహించని విధంగా గా దెబ్బ తగిలింది.
ఆయన కూడా వరుస అవకాశాలు రావడంతో హీరోగా చేస్తూ వచ్చిన సునీల్ చివరికి కనీసం ఓపెనింగ్ కలెక్షన్స్ కూడా సొంతం చేసుకోలేని స్థాయికి పడిపోయాడు.
దీంతో తప్పని పరిస్థితిలో మరల కమెడియన్ గా తిరిగి టర్న్ తీసుకున్నాడు.ఇక సునీల్ కమెడియన్ గా స్టార్ట్ చేసిన తర్వాత అతనికి వరుసగా స్టార్ హీరోల చిత్రాల్లో అవకాశాలు వచ్చాయి.
అయితే అతని కామెడీ టైమింగ్ కి తగ్గ పాత్రలేవీ కూడా అతనికి రాలేదు.దీంతో ఏదో అలా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా జర్నీ సాగుతుందని.ఇదిలా ఉంటే మరలా సునీల్ హీరోగా థ్రిల్లర్ మూవీకి ఓకే చెప్పినట్లు తెలుస్తుంది.బాలీవుడ్లో ఆయుష్మాన్ ఖురానా ప్రధాన పాత్రలో తెరకెక్కిన అందాధున్ సినిమాకి సునీల్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని తెలుస్తుంది.
ఈ సినిమా రెగ్యులర్ జోనర్లో కాకుండా డిఫరెన్స్ స్క్రీన్ ప్లేతో నడిచే సినిమా కావడం ఇది తనకి మరలా ప్లస్ అవుతుందని భావించి సునీల్ ఈ సినిమాకి ఓకే చెప్పినట్లు తెలుస్తుంది.