బిగ్ బాస్ షో హోస్ట్ మారిపోయారా... నాగ్ స్థానంలో సందడి చేస్తున్న సుమ, ఓంకార్?

బిగ్ బాస్ సీజన్ సెవెన్ కార్యక్రమం ప్రస్తుతం ప్రసారమవుతున్న సంగతి మనకు తెలిసిందే.ఇప్పటికే ఆరువారాలను పూర్తి చేసుకున్నటువంటి ఈ కార్యక్రమం ఏడవ భారం కూడా పూర్తి కాబోతుంది.

 Suma And Omkar Host Bigg Boss 7 Full Details, Bigg Boss, Nagarjuna,omkar,suma ,-TeluguStop.com

అయితే ఈ వారం బిగ్ బాస్ (Bigg Boss) వేదికపై ఆటపాటలతో పెద్ద ఎత్తున ప్రేక్షకులను కంటెస్టెంట్లను సందడి చేయబోతున్నారని తెలుస్తుంది.అయితే ఈవారం ఈ వేదికపై నాగార్జున( Nagarjuna ) కాకుండా ఆయన స్థానంలో ఓంకార్ (Omkar) సుమ(Suma) వంటి వారు సందడి చేయబోతున్నారని తెలుస్తోంది.

ఈ వారం బిగ్ బాస్ కార్యక్రమానికి వ్యాఖ్యాతలుగా నాగార్జున కాకుండా సుమ ఓంకార్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తారు అంటూ ఒక వార్త వైరల్ గా మారింది.

Telugu Anchor Omkar, Anchor Suma, Bigg Boss, Bubble Gum, Web, Naga Saroja, Nagar

నాగార్జున సోదరి నాగసరోజ( Nagasaroja ) మరణించడం వల్లే ఈయన ఈ వారం షూట్ కి హాజరు కాలేకపోతున్నారు అంటూ వార్తలు వస్తున్నప్పటికీ నాగార్జున మాత్రం ఈ కార్యక్రమానికి హాజరు కాబోతున్నారని అయితే సుమ ఓంకార్ ఇద్దరు కూడా ఎప్పటిలాగే కంటెస్టెంట్లను ఎంటర్టైన్ చేయడం కోసమే ఈ వేదిక పైకి రాబోతున్నారని తెలుస్తుంది.ప్రతి సీజన్లోని హైపర్ ఆదితో పాటు సుమ కూడా బిగ్ బాస్ కంటెస్టెంట్లతో ముచ్చటిస్తూ వేదికపై సందడి చేస్తూ ఉంటారు.అలాగే ఈసారి ఈ వేదిక పైకి వచ్చారని అదేవిధంగా తన కుమారుడు రోషన్( Roshan ) బబుల్ గమ్ సినిమా ప్రమోషన్లను కూడా నిర్వహించబోతున్నారని తెలుస్తుంది.

Telugu Anchor Omkar, Anchor Suma, Bigg Boss, Bubble Gum, Web, Naga Saroja, Nagar

ఇక ఓంకార్ సైతం తన మాన్షన్ సిరీస్( Mansion Series ) ప్రమోషన్లలో భాగంగా ఇదివరకే హౌస్ లోకి వెళ్లి కంటెస్టెంట్లతో సందడి చేశారు.మరి ఎపిసోడ్ శుక్రవారం లేదా శనివారం ప్రసారం చేయబోతున్నారని తెలుస్తోంది.ఇక దసరా పండుగ రావడంతో పెద్ద ఎత్తున సెలబ్రిటీలను వేదికపైకి ఆహ్వానించి ఎంటర్టైన్ చేయబోతున్నారని సమాచారం.ఇక దసరా పండుగ కావడంతో ఈ వారం ఎలిమినేషన్ ఉండకపోవచ్చు అని వార్తలు వస్తున్నప్పటికీ మరి కొందరు మాత్రం డబుల్ ఎలిమినేషన్ ఉంటుందని తెలుస్తుంది.

రతిక ( Rathika ) తిరిగి హౌస్ లోకి రాబోతున్నటువంటి నేపథ్యంలో ఈవారం డబుల్ ఎలిమినేషన్ ఉండవచ్చు అనే వార్తలు కూడా వస్తున్నాయి .మరి ఈ వారం ఎలిమినేషన్ ఉంటుందా లేదా అన్నది తెలియాల్సి ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube