ఆ సీన్లను డైరెక్టర్ సుకుమార్ కాపీ చేసి సినిమాలో పెట్టారా.. అసలేం జరిగిందంటే?

టాలీవుడ్ పాన్ ఇండియా హీరో అల్లు అర్జున్( Allu Arjun ) హీరోగా నటించిన తాజా చిత్రం పుష్ప 2.

( Pushpa 2 ) గతంలో విడుదల అయిన పుష్ప పార్ట్ వన్ కి సీక్వెల్ గా ఈ సినిమా తెరకెక్కిన విషయం తెలిసిందే.

భారీ అంచనాల నడుమ ప్రపంచవ్యాప్తంగా విడుదల అయిన ఈ సినిమా 1800 కోట్లకు పైగా కలెక్షన్లను సాధించి సరికొత్త రికార్డులు సృష్టించింది.ముఖ్యంగా ఆర్ఆర్ఆర్, బాహుబలి 2 లాంటి రికార్డులను సైతం బద్దలు కొట్టింది.

ఈ సినిమా మంచి సక్సెస్ అయిన సందర్భంగా మూవీ మేకర్స్ ఈ సినిమా సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్నారు.ఇది ఇలా ఉంటే త్వరలోనే మూవీ మేకర్స్ ఈ సినిమా 50 రోజుల వేడుకను జరుపుకోనున్నారు.

కాగా డైరెక్టర్ సుకుమార్( Sukumar ) దర్శకత్వం వహించిన ఈ సినిమాలో శ్రీవల్లి పాత్రలో రష్మిక మందన( Rashmika Mandanna ) నటించిన విషయం తెలిసిందే.

Advertisement

పుష్ప సినిమాలో చాలా సన్నివేశాలు సినిమాకు హైలెట్ గా నిలిచాయి.అలాగే కొన్ని సీన్స్ ప్రేక్షకులను బాగా అలరించాయి.ముఖ్యంగా వైఫ్ అండ్ హస్బెండ్ క్యారెక్టర్స్ లో అల్లు అర్జున్, రష్మిక వచ్చిన సీన్స్ అయితే మెస్మరైజ్ చేశాయని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.

ఇకపోతే డైరెక్టర్ సుకుమార్ కూతురు సుకృత వేణి కీలక పాత్రలో తాజాగా నటించిన చిత్రం గాంధీ తాత చెట్టు.( Gandhi Tatha Chettu ) ఈనెల 24న ఇది విడుదల కానుంది.

ఈ సందర్భంగా ఈ ప్రమోషన్స్ లో భాగంగా బిజీ బిజీగా ఉన్నారు డైరెక్టర్ సుకుమార్.ఇప్పటికే ఈ ప్రమోషన్స్ కి కార్యక్రమాలకు సంబంధించిన కొన్ని ఫన్నీ వీడియోలు యూట్యూబ్లో ఇక వైరల్ అవుతున్న విషయం తెలిసిందే.

కొత్తగా కాస్త వినూత్నంగా ప్రమోషన్స్ కార్యక్రమాలను చేస్తున్నారు.

టాలీవుడ్ ఇండస్ట్రీని టార్గెట్ చేస్తున్న ఐటీ.. తెర వెనుక ఇంత జరిగిందా?
హాలీవుడ్ డైరెక్టర్ డైరెక్షన్ లో యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్.. బాక్సాఫీస్ షేక్ కానుందా?

అయితే ఈ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా సుకుమార్ వైఫ్ తబిత( Thabitha ) పుష్ప 2 లోని సీన్స్ గురించి మాట్లాడుతూ.వైఫ్ అండ్ హస్బెండ్ కెమిస్ట్రీ చాలా వరకు తమ నిజ జీవితంలో జరిగినవే.వాటినే సుకుమార్ కాపీ చేసి పుష్ప 2 లో పెట్టారని చెప్పుకొచ్చింది.

Advertisement

ఇప్పుడు ఈ మాటలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.కూతురు సుకృతాన్ని సపోర్ట్ చేస్తూ ఒకవైపు సుకుమార్ మరోవైపు తబితాలు పెద్ద ఎత్తున ప్రమోషన్స్ కార్యక్రమాలను చేస్తున్న విషయం తెలిసిందే.

ప్రస్తుతం ఇంస్టాగ్రామ్, యూట్యూబ్ లో ఎక్కడ చూసినా కూడా ఈ ప్రమోషన్స్ కార్యక్రమాలకు సంబంధించిన వీడియోలే వైరల్ అవుతున్నాయి.ఇకపోతే ఈ సినిమా విషయానికి వస్తే.

గాంధీ తాత చెట్టు సినిమాని అగ్ర నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ నిర్మించగా సుకుమార్ కథ ని అందించడం జరిగింది.బాను ప్రకాష్,ఆనంద్ చక్రపాణి,రాగ్ మయూర్, నేహాల్ ఆనంద్ తదితరులు ముఖ్య పాత్రల్లో నటించారు.

తాజా వార్తలు