Sukumar: ఖచ్చితంగా సినిమా ఇండస్ట్రీని మరో లెవెల్ లో నిలిపేది రాజమౌళి కాదు సుకుమార్ మాత్రమే… ఎందుకో తెలుసా ?

ఇండస్ట్రీలో టాప్ మోస్ట్ డైరెక్టర్ ఎవరు అని అడగగానే టక్కున రాజమౌళి( Rajamouli ) పేరు అందరూ చెబుతూ ఉంటారు కానీ రాజమౌళి గొప్ప దర్శకుడు అంతకన్నా ఇంటలిజెంట్ డైరెక్టర్ మాత్రం సుకుమార్( Sukumar ) అన్న విషయాన్ని అంత తొందరగా జనాలు చెప్పలేరు ఎందుకంటే సినిమా ఫ్లాప్ అవ్వకుండా జనాల పల్స్ పట్టుకుని రాజమౌళి సినిమాలు తీస్తూ ఉంటాడు.అయితే సుకుమార్ తీసే సినిమాలు ప్రేక్షకులకు అర్థం కాదు నిజానికి ఆయన తీసిన కొన్ని సినిమాలు అలాగే ఉన్నాయి ఆ సినిమాలు కనుక హిట్ అయి ఉంటే సుకుమార్ మరో రేంజ్ లో ఉండేవాడు.

 Sukumar Is The Number One Director In Tollywood Industry-TeluguStop.com

ప్రేక్షకులకు అర్థం కాకుండా సినిమాలు తీయడం అంటే ఒకరకంగా అవి ఇంటలిజెంట్ సినిమాలు అని అనుకోవాల్సి వస్తుంది.సుకుమార్ మొదట్లో ఇంటలిజెంట్ గా సినిమాలో తీస్తున్నాడు అని అనుకున్నాడు కానీ అవి జనాల్లోకి రీచ్ కావడం లేదని త్వరగానే అర్థం చేసుకున్నాడు.

Telugu Rajamouli, Number, Nenokkadine, Pushpa, Rangasthalam, Sukumar, Tollywood-

సుకుమార్ తీసిన వన్ చిత్రమే( One Nenokkadine ) ఎందుకు ఉదాహరణ.ఆ సినిమా సాధారణ ప్రేక్షకులకు అర్థం కాలేదు.అతడు చాలా చక్కగా సినిమాను తీశాడు ఎంతో ఇంటలిజెంట్ గా తన స్క్రీన్ ప్లే ని మల్చాడు.కానీ ఆ సినిమా మామూలు మనుషులకు అర్థం కాకపోవడంతో ఫ్లాప్ అయింది.

ప్రయోగాలు చేయడం మొదటినుంచి సుకుమార్ కి అలవాటే.ప్రయోగాత్మక చిత్రాలు చేయాలంటే సుకుమార్ తర్వాతే ఎవరైనా.

అయితే వన్ సినిమా ఫ్లాప్ అవడం సుకుమార్ కి కొన్ని విషయాల్లో కళ్ళు తెరిపించాయని చెప్పచ్చు.సినిమా తీయడం వేరు అందరికీ నచ్చేలా తీయడం వేరు అనే విషయాన్ని అర్థం చేసుకున్నాడు.

Telugu Rajamouli, Number, Nenokkadine, Pushpa, Rangasthalam, Sukumar, Tollywood-

అందుకే ఇలాంటి ప్రయోగాల జోలికి పోకుండా ప్రేక్షకుడికి సినిమా అర్థమయ్యే విధంగా సినిమాలు తీయాలని డిసైడ్ అయ్యి రంగస్థలం( Rangasthalam ) పుష్ప( Pushpa ) వంటి బ్లాక్ బాస్టర్ సినిమాలను తెరకెక్కించాడు ఇక ముందు కూడా తన సినిమాలను ప్రేక్షకులకు అర్థం చేసుకునే తెలివితేటలు లేవు అని అలాంటి సినిమాలు తీస్తానని వన్ సినిమా తర్వాత ఒక స్టేట్మెంట్ కూడా ఇచ్చాడు.కానీ తనకు ప్రయోగాలు చేయడం అంటేనే ఇష్టమని విబంధమైన కథలను తెరకెక్కించడం అంటే మరీ ఇష్టం అని సుకుమార్ ఎన్నోసార్లు చెబుతున్నాడు మరి ముందు ముందు అయినా ప్రేక్షకులు తీసే సినిమాలను అర్థం చేసుకొని హిట్ ఇస్తారా అనేది వేచి చూస్తే కానీ తెలియదు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube