విజయ్ దేవరకొండ( Vijay Devarakonda ) ప్రస్తుతం మజిలీ సినిమా డైరెక్టర్ శివ నిర్వాణ ( Director Shiva Nirvana )డైరెక్షన్లో ఖుషి సినిమా( Khushi movie ) చేస్తున్న విషయం తెలిసిందే ఆల్మోస్ట్ ఈ సినిమా షూటింగ్ అయిపొయింది దింతో ఈ సినిమా తొందర్లోనే రిలీజ్ కి కూడా రెడీ అవుతుంది.ఈ సినిమా తర్వాత గౌతమ్ తిన్ననూరి ( Gautam Tinnanuri )డైరెక్షన్ లో ఒక సినిమాకి కమిట్ అయ్యాడు విజయ్ అయితే ఈ సినిమా తో పాటు దిల్ రాజు బ్యానర్ లో కూడా ఒక సినిమా చేయబోతున్నాడు.
ఈ మూవీ కి హరీష్ శంకర్ డైరెక్టర్ గా వ్యహరించబోతున్నారు అని తెలుస్తుంది హరీష్ శంకర్ పవన్ కళ్యాణ్ తో చేసే భవదీయుడు భగత్ సింగ్ సినిమా లేట్ అయ్యే అవకాశాలు ఉండటంతో హరీష్ శంకర్ ఈ సినిమా చేసే ఉదేశ్యంలో ఉన్నట్టు తెలుస్తుంది.
విజయ్ దేవరకొండ పెళ్లి చూపులు, అర్జున్ రెడ్డి సినిమాలతో చాలా పాపులర్ అయ్యారు కానీ ఒక్క లైగర్ సినిమా ప్లాప్ తో ఆయన క్రెజ్ కొంతవరకు డౌన్ ఫాల్ అయిందనే చెప్పాలి.అందుకే ఇప్పుడు చేయబోయే సినిమాల విషయంలో ఆచితూచి అడుగులు వేస్తున్నట్లు తెలుస్తుంది.శివ నిర్వాణ మూవీ లవ్ స్టోరీ కాగా గౌతమ్ తిన్ననూరి సబ్జెక్టు వచ్చేసి స్పోర్ట్స్ బ్యాక్ గ్రౌండ్ అని తెలుస్తుంది బేసిక్ గా ఈ సినిమా రామ్ చరణ్ చేయాల్సింది కానీ రామ్ చరణ్ బుచ్చి బాబు కి అవకాశం ఇవ్వడంతో ఆ కథ విజయ్ దగ్గరికి వచ్చింది.
ఇది ఇలా ఉంటె చాలా రోజుల క్రితమే సుకుమార్ డైరెక్షన్ విజయ్ దేవరకొండ సినిమా చేస్తున్నారు అని ఒక అనౌన్స్ మెంట్ కూడా వచ్చింది సుకుమార్ పుష్ప 2 లో బిజీ గా ఉన్న విషయం తెలిసిందే నాకు తెలిసి ఈ సినిమా పూర్తి అయినా తర్వాత సుకుమార్ సినిమా ఉంటుందా లేదా అనేది తెలియాల్సి ఉంది ప్రస్తుతానికి అయితే సుకుమార్ గాని విజయ్ గాని ఈ మూవీ గురించి ఇంకా ఎం అప్డేట్ ఇవ్వలేదు.విజయ్ దేవరకొండ లైగర్ సినిమా ప్లాప్ తర్వాత బయట ఎక్కడ పెద్దగా కనిపించడం లేదు అనే విషయం అయితే తెలిసిందే…
.