జూలై నాలుగవ తారీకు ఏపీలో ప్రధాని మోడీ రెండు చోట్ల పర్యటన చేస్తున్న సంగతి తెలిసిందే.అల్లూరి సీతారామరాజు 125వ జయంతి ఉత్సవాల్లో భాగంగా భీమవరం అదేవిధంగా విశాఖపట్టణంలో మోడీ పర్యటిస్తున్నారు.
ఇటువంటి తరుణంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డతో బీజేపీ రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరి బుధవారం ఢిల్లీలో భేటీ కావడం సంచలనంగా మారింది.
ఏపీలో రాజకీయ పరిస్థితులు మరియు ఇంకా అనేక విషయాలపై నడ్డాతో చర్చించడం జరిగింది.
ఈ విషయాన్ని స్వయంగా సుజనా చౌదరి సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు.ఆయన ఏమన్నారంటే.
బిజెపి జాతీయ అధ్యక్షులు జెపి నడ్డా గారిని కలిసి ఎపిలో పరిస్థితుల గురించి వివరించాను.రాష్ట్రంలో పార్టీ పురోగమనానికి తీసుకోవలసిన చర్యలతో పాటు పోలవరం, అమరావతి, రైల్వే జోన్ పనులను కేంద్రం వేగవంతం చేసేలా చర్యలు తీసుకోవాలని కోరాను.
అని తెలిపినట్లు సుజనా చౌదరి సోషల్ మీడియాలో వెల్లడించారు.దీంతో వీరిద్దరి బేటీ ఏపీ రాజకీయాల్లో సంచలనంగా మారింది.







