సుడిగాలి సుధీర్ రష్మీ జోడీ గత తొమ్మిదేళ్లుగా వార్తల్లో నిలుస్తున్నారు.ఈ జోడీ రియల్ జోడీ కాదని తెలిసినా చాలా సందర్భాల్లో సుధీర్ రష్మీ తమ కెమిస్ట్రీతో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నారు.
కొన్నిరోజుల క్రితం రష్మీ మాట్లాడుతూ తనకు సుధీర్ కు మధ్య ప్రేమ ఉందనే విధంగా కామెంట్లు చేయగా ఆ కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.అటు సుధీర్ ఇటు రష్మీ వేర్వేరుగా సినిమాలలో నటిస్తున్నారు.
అయితే సుధీర్ రష్మీ కలిసి ఒక సినిమాలో అయినా నటించాలని ఫ్యాన్స్ భావిస్తుండగా ఆ దిశగా అడుగులు పడుతున్నాయని తెలుస్తోంది.గాలోడు సినిమా ప్రమోషన్స్ లో భాగంగా సుధీర్ రష్మీతో కలిసి ఒక సినిమాలో నటించనున్నట్టు వెల్లడించారు.
రష్మీ మెయిన్ రోల్ లో ఒక లేడీ ఓరియెంటెడ్ మూవీ తెరకెక్కనుందని ఈ సినిమాలో తాను కూడా ఒక ముఖ్యమైన పాత్రలో నటిస్తానని సుధీర్ తెలిపారు.
గజ్జల గుర్రం అనే టైటిల్ తో ఈ సినిమా తెరకెక్కనుందని సుధీర్ కామెంట్లు చేశారు.
అయితే ఈ సినిమాకు సంబంధించి ఇతర వివరాలు తెలియాల్సి ఉంది.సుధీర్, రష్మీ కాంబినేషన్ అంటే ఈ సినిమాకు బిజినెస్ కూడా భారీ రేంజ్ లోనే జరిగే ఛాన్స్ అయితే ఉంది.సుధీర్ రష్మీ కాంబినేషన్ ను సిల్వర్ స్క్రీన్ పై చూడాలని భావించే అభిమానుల కోరిక నెరవేరడానికి ఎంతో సమయం పట్టదని మరి కొందరు కామెంట్లు వ్యక్తం చేస్తుండటం హాట్ టాపిక్ అవుతోంది.
హీరోగా సరైన సక్సెస్ లేని సుడిగాలి సుధీర్ కు గాలోడు సినిమా కోరుకున్న సక్సెస్ ను కచ్చితంగా అందిస్తుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు.సుధీర్, రష్మీ జయాపజయాలతో సంబంధం లేకుండా పరిమితంగా రెమ్యునరేషన్ ను డిమాండ్ చేస్తుండటంతో వాళ్లకు ఆఫర్లు పెరుగుతున్నాయని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.సుధీర్ రష్మీ జోడీ రియల్ జోడీ కావాలని కొంతమంది ఫ్యాన్స్ చెబుతున్నారు.