టాలీవుడ్ హీరో సుధీర్ బాబు( Sudheer Babu ) తాజాగా నటించిన చిత్రం హరోం హర.( Harom Hara Movie ) జ్ఞాన సాగర్ ఈ సినిమాకు దర్శకత్వం వహించిన విషయం తెలిసిందే.
కుప్పం బ్యాక్ డ్రాప్ లో రూపొందిన ఈ మూవీ పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానుంది.ఇటీవలే ఈ సినిమాకు సంబంధించిన టీజర్ ని కూడా విడుదల చేశారు మూవీ మేకర్స్.
టీజర్ కు ప్రేక్షకుల నుంచి పాజిటివ్ స్పందన లభిస్తోంది.ఇది ఇలా ఉంటే తాజాగా మూవీ మేకర్స్ ఒక ప్రెస్ మీట్ నిర్వహించారు.
ఇందులో భాగంగానే పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు హీరో సుధీర్ బాబు. ఈ సినిమాకు హరోం హర అని టైటిల్ పెట్టడానికి కారణం ఏంటి అని ప్రశ్నించగా.
డైరెక్టర్ సాగర్ మాట్లాడుతూ.
సుబ్రహ్మణ్య స్వామిని పూజించే సమయంలో ఎక్కువగా హరోం హర అనే పదాన్ని ఉపయోగిస్తుంటారు.
ట్యాగ్‌లైన్‌లో చెప్పినట్టుగానే ఈ సినిమాలో తిరుగుబాటు అనేది ఉంటుంది.చిత్తూరు జిల్లా కుప్పం బ్యాక్‌డ్రాప్‌లో( Kuppam Backdrop ) దీనిని తీర్చిదిద్దుతున్నాం.
సినిమా కథకు అనుగుణంగానే హరోం హర అనే టైటిల్ ఫిక్స్ చేశాము అని తెలిపారు.యాక్షన్ హీరోగానే ఉండాలని మీరు అనుకుంటున్నారా? అని హీరోని ప్రశ్నించగా సుధీర్ స్పందిస్తూ.ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన సమయంలో గొప్ప నటుడిగా నిరూపించుకోవాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు.కెరీర్‌లో రాణించే సమయంలో ఒక జానర్‌కు ఫిక్స్ అవుతాముందు.అలా, యాక్షన్ తరహా కథలు నాకు బాగా సెట్ అవుతాయనే భావన కలిగింది.

మంచి కథ ఉంటే తప్పకుండా యాక్షన్ చిత్రాల్లో( Action Movies ) నటిస్తాను అని తెలిపారు సుధీర్.ఈ సినిమా కథ ఓకే చేయడానికి గల ప్రధాన కారణం ఏంటి అని అడగగా.ఈ కథ చాలా కొత్తగా ఉంటుంది.
ఇప్పటివరకూ నేను ఇలాంటి కథలో నటించలేదు.కమర్షియల్ ఎలిమెంట్స్ కూడా చక్కగా కుదిరాయి.
కథ, నటీనటుల పాత్రల చిత్రీకరణ, సినిమాలోని ప్రతి రంగంపై దర్శకుడికి ఉన్న అభిరుచి చూసి దీనికి ఓకే చెప్పాను అని తెలిపారు సుధీర్ బాబు. యాక్షన్ పరంగా ఈ చిత్రానికి మీరు న్యాయం చేయగలిగారని అనుకుంటున్నారా? అని సుదీర్ ని ప్రశ్నించగా సుధీర్ బాబు స్పందిస్తూ.

యాక్షన్ హీరో( Action Hero ) అంటే ఎలాంటి లక్షణాలు ఉండాలని మీరు అనుకుంటున్నారు? నా వరకూ నేను చేసిన యాక్షన్ ఏ హీరో చేయలేరు.కథ సపోర్ట్ చేస్తే సీజీ లేకుండా ఎలాంటి యాక్షన్ అయినా నేను చేసినంతగా ఏ హీరో చేయలేరు.అది అయితే తప్పకుండా చెప్పగలను.జాకీచాన్‌కు నేను అభిమానిని.నేను సినిమాల్లోకి రాకముందు మా ఇంటి పక్కన థియేటర్‌లో జాకీచాన్ సినిమాలు విడుదలైనప్పుడు రోలింగ్ టైటిల్స్‌లో వచ్చే యాక్షన్ సీన్స్ చూడటం కోసమే నేను వెళ్లేవాడిని అని తెలిపారు సుధీర్ బాబు.







