మనం సాధారణంగా చెరువులలో, చిన్న చిన్న జలపాతాలలో 5 నుంచి 10 కిలోల వరకు బరువు ఉన్న చేపలు లభించడం చూస్తూనే ఉంటాం.అంతే కాకుండా దాదాపు అన్ని చెరువులలో ఎక్కువగా 15 కిలోల వరకు బరువు ఉన్న చేపలను పట్టుకోవడం లాంటిది సహజం.
తాజాగా ఓ జలాశయంలో మాత్రం ఎవరూ ఊహించని రీతిలో వలకు భారీ చేప ఒకరి వలలో పడింది.
ఇందుకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే.
నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం ఠాణా కలాన్ శివారులో అలీసాగర్ జలాశయం ఉన్న సంగతి అందరికీ తెలిసిందే.ఈ జలాశయం లో తాజాగా మత్స్యకారులు చేపల వేటకు వెళ్లిన సమయంలో వారికి ఏకంగా 30 కిలోల చేప వలలో దొరికింది.
దీంతో మత్స్యకారులు అందరూ ఆ భారీ చేపను చూసి ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు.

ఒక్కసారిగా అంత భారీ చేప మత్స్యకారులకు దొరకడంతో వారి ఆనందానికి అవధులు లేవు.ఇక ఈ భారీ చేపబొచ్చరకానికి చెందినది అని మత్స్యకారులకు తెలియజేస్తూన్నారు ప్రస్తుతం ఈ చేప కు సంబంధించి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా చక్కర్లు కొడుతున్నాయి.అయితే ఇప్పటి వరకు ఆ జలాశయంలో దొరికిన చేపలు అన్నీ కూడా ఐదు నుంచి పది కేజీల మధ్య లోనే ఉన్నాయని అక్కడి మత్స్యకారులు పేర్కొంటూన్నరుఈ సారి భారీ చేప మత్స్యకారుల వలకు చిక్కడంతో అక్కడి స్థానికులు ఆ చేపను చూసేందుకు తరలివస్తున్నారు.
ఇంకెందుకు ఆలస్యం ఈ భారీ చేప ఫోటోలు మీరు కూడా వీక్షించండి.