హైదారాబాదులోని వై కా పా అధినేత జగన్ ఇంటిని ఆందోళనకారులు ముట్టడించారు.తెలంగాణా నీటిపారుదల ప్రాజెక్టులకు వ్యతిరేకంగా జగన్ జల దీక్ష పేరుతో నిరాహార దీక్ష చేస్తున్నందుకు నిరనగా ఉస్మానియా విశ్వవిద్యాలయం విద్యార్థులు, తెలంగాణా నవ నిర్మాణ్ సేన కార్యకర్తలు జగన్ నివాసం లోటస్ పాండ్ ను ముట్టడించారు.
జగన్ మీద ఆగ్రహంగా ఉన్న ఆందోళనకారులు ఆయన నివాసాన్ని ముట్టడిస్తామని ముందే హెచ్చరించారు.దీంతో పోలీసు అధికారులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
అయినప్పటికీ ముట్టడించడంతో పోలీసులు వారిని అడ్డుకున్నారు.







