కరోనా కారణంగా తెలంగాణ రాష్ట్రంలో ఇంటర్ టెన్త్ పరీక్షలు ఇటీవల అందరినీ పాస్ చేయడం తెలిసిందే.సరిగ్గా పరీక్షలు జరగాల్సిన టైములో కరోనా సెకండ్ వేవ్ తీవ్రత అధికంగా ఉండటంతో.
తెలంగాణ విద్యాశాఖ పరీక్షలను వాయిదా వేస్తూ వచ్చింది.అయితే వైరస్ ఎంత మాత్రం అదుపులోకి రాకపోవడంతో… టెన్త్ ఇంటర్ పరీక్షలను వాయిదా వేసి ఇటీవల విద్యార్థులను పాస్ చేయడం జరిగింది.

ఇటువంటి పరిస్థితుల్లో జె ఎన్ టి యు హెచ్, ఉస్మానియా విద్యార్థి సంఘాలు ఇంజనీరింగ్, డిగ్రీ పరీక్షలను కూడా వాయిదా వేయాలని ఈరోజు ఉదయం ర్యాలీ నిర్వహించారు.సత్యసాయి నిగమాగమం నుండి తెలంగాణ విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి ఇంటివద్ద వరకు ర్యాలీగా విద్యార్థి సంఘాల నాయకులు బయలుదేరడం జరిగింది.ఆ తర్వాత తెలంగాణ విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఇంటిని ముట్టడించారు.పరీక్షలు వాయిదా వేయాలని లేదా ఆన్లైన్ విధానం ద్వారా పరీక్షలు నిర్వహించాలని విద్యార్థి సంఘాల నాయకులు డిమాండ్ చేశారు.