రామ్ చరణ్ పుట్టడమే గోల్డెన్ స్పూన్ తో పుట్టాడు.తన తండ్రి మెగాస్టార్ గా టాలీవుడ్ ని ఏలుతున్న రోజుల్లోనే ఈ భూమి పైకి అడుగు పెట్టాడు.
సినిమా ఇండస్ట్రీని అతి దగ్గరగా చూస్తూనే పెరిగాడు.అయినా కూడా చాలామంది హీరోలకి రామ్ చరణ్ కి ఉన్న తేడా ఏంటో తెలుసా అదే క్రమశిక్షణ.
తన తండ్రి దగ్గర నుంచి, తాత దగ్గర నుంచి నేర్చుకున్న క్రమశిక్షణ ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలి అనే తత్వం.ఎన్ని అవకాశాలు ఎదురుగా ఉన్నా కూడా ఎప్పుడూ కష్టపడుతూ తనని తాను తీర్చిదిద్దుకుంటూ ఒక్కో అడుగు ముందుకేస్తూ వెళ్తున్నాడు రామ్ చరణ్.
మొదటి సినిమాతోనే సూపర్ హిట్ కొట్టినా కూడా అభిమానుల నుంచి మార్కులు సంపాదించుకున్న కూడా ప్రతి సినిమా మొదటి సినిమా అన్న విధంగానే కష్టపడుతూ నటిస్తూ ఉంటాడు.

అసలు హీరో మెటీరియల్ కాదు అని చాలామంది నెగటివ్ గా ట్రోల్ చేసినా కూడా పట్టించుకోకుండా తనను తాను చెక్కుకుంటూ వెళ్తున్నాడు.చింపాంజీ మొహం అంటూ చాలామంది తొలినాళ్లలో రామ్ చరణ్ పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు.ఒకసారి తన భార్యతో వెళుతున్న రామ్ చరణ్ ని దారుణంగా అవమానించారు కూడా.
ఇవన్నీ కూడా తాను కెరియర్ లో ఎదగడానికి మరింత శ్రమించడానికి అవకాశాలుగా తీసుకున్నాడు.కానీ ఏ రోజు మీడియా ముందు కాని ఎవరిపైన అసహనం వ్యక్తం చేయలేదు.
అలా టాలీవుడ్ నటుడిగా స్టార్ హీరో కొడుకుగా ఉన్నా రామ్ చరణ్ ప్రపంచ స్థాయి హీరోగా పేరు ప్రఖ్యాతలను అందుకుంటున్నాడు.ఏ నోట విన్నా కూడా ఇప్పుడు అతడి పేరే వినిపిస్తోంది.
ఇప్పుడు ప్రపంచం కూడా తన వైపు చూసేలా చేసుకోవడంలో రామ్ చరణ్ సక్సెస్ అయ్యాడు.

తనకు పాన్ ఇండియా కాదు పాన్ వరల్డ్ సినిమాల్లో నటించాలని ఉంది అనే కోరికను సైతం ఇటీవల ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో బయటపెట్టాడు రామ్ చరణ్.మరోవైపు అతి త్వరలో తండ్రి కాబోతున్నాడు, ఉపాసన లాంటి ఒక పెద్ద ఇంటికి అమ్మాయిని భార్యగా తెచ్చుకుని ఆమె స్థాయిని మరింత పెంచాడే తప్ప ఎక్కడ కూడా తనను తాను తక్కువ చేసుకోలేదు.ఇలా ప్రతి అడుగులో మెరుగులు దిద్దుకుంటూ నటనలో, ఆహార్యంలో తనదైన రీతిలో ముందుకు అడుగేస్తూ రామ్ చరణ్ రానున్న రోజుల్లో మరిన్ని సక్సెస్ అందుకోవాలని కోరుకుందాం.