అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ ఏమంటూ అధికారం చేపట్టారో కాని ప్రశాంతంగా పరిపాలన సాగించే పరిస్థితులు ఇప్పటికి ఒక్కటి కనిపించలేదు.క్యాపిటల్ భవనం పై దాడి ఘటన, రిపబ్లికన్ పార్టీ నేతలు, ట్రంప్ ఎప్పటికప్పుడు బిడెన్ తీసుకునే నిర్ణయాలకు అడ్డుపడటం, నిరసనలు చేపట్టడం, కరోనా విజ్రుంభణ, మరో పక్క నిరుద్యోగం, నిత్యావసరాల ధరలు పెరుగుదల, మరో వైపు ప్రకృతి విపత్తులు ఇలా ఒకటి కాదు రెండు కాదు నిత్యం బిడెన్ కు ఏదో ఒక సమస్య వెంటాడుతూనే ఉంటుంది.
తాజాగా అతి పెద్ద సవాల్ బిడెన్ ముందుకు వచ్చి నిలబడింది.ఉన్న సమస్యలు చాలవన్నట్టుగా వచ్చిపడిన తాజాగా సమస్యపై బిడెన్ మల్లగుల్లాలు పడుతున్నారట.
కరోనా కారణంగా అమెరికన్స్ ఎంతో మంది ఉద్యోగాలు కోల్పోయిన విషయం విధితమే.ముఖ్యంగా ఈ ప్రభావం వ్యాపార రంగంలో కనిపిస్తోంది.ఈ వ్యాపార సంస్తాలనే నమ్ముకుని బ్రతుకుతున్న ఎంతో మంది కార్మికులు ఎంతో మంది ఉద్యోగాలు పోగొట్టుకున్నారు కూడా.అయితే కరోనా థర్డ్ వేవ్ తగ్గుముఖం పట్టడంతో మళ్ళీ అన్ని రంగాలు ఊపండుకున్నాయి.
కానీ పెరిగిపోయిన నిత్యావసరాలతో గతంలో ఇచ్చిన జీతాలు చాలడం లేదని, జీతాలు పెంచాల్సిందేనని, నిరుద్యోగులుగా ఉన్న వారికి ఉద్యోగాలు ఇవ్వాలని వేలాది మంది కార్మికులు అమెరికా రోడ్లపై భారీ నిరసనలు చేపట్టారు.రోడ్లపై కి వస్తూ భారీ నిరసనలు చేపట్టారు.
కార్మికులు విధులను బాయ్ కాట్ చేసి రోడ్డెక్కడంతో కొన్ని యూనియన్ల యాజమాన్యాలు కార్మికులతో రాజీ కుదుర్చుకున్నాయి.మిగిలిన యూనియన్లు మాత్రం నిరసనలను కొనసాగిస్తున్నాయి.వ్యవసాయ పనిముట్ల భారీ యంత్రాలు చేసే అతిపెద్ద సంస్థలో పనిచేసే సుమారు 10 వేల మంది కార్మికులు ప్రస్తుతం అధిక జీతాలు కావాలంటూ రోడ్లపై నిరసనలు తెలుపడంతో యాజమాన్యాలు తలలు పట్టుకున్తున్నాయి.త్వరలో హాస్పటల్ సిబ్బంది,నర్సులు లతో సహా సుమారు 2వేల మంది సమ్మెలో పాల్గొననున్నారట.
అలాగే ఆల్కహాల్ కర్మాగాలలో పనిచేసే సుమారు 500 మంది, బస్సు డ్రైవర్లతో సహా ప్రతీ ఒక్క కార్మికుడు కార్మిక యూనియన్లు చేపట్టబోయే నిరసనలకు సంఘీభావం తెలుపనున్నారట.
.