సోషల్ మీడియాలో ఒక వీధి కుక్కకు సంబంధించిన పోస్ట్ నెటిజన్లందరినీ భావోద్వేగానికి గురి చేస్తోంది.ఈ ఫొటో పోస్ట్‌లో ఒక కుక్క ఒక నటుడిని కాపాడేందుకు ముందుకొచ్చింది.
అంతే కాదు అతడికి ప్రేమను పంచింది.ఇది తెలుసుకున్న నెటిజన్లు ఆ కుక్కని తెగ మెచ్చుకుంటున్నారు.
ఈ కుక్క మనసు చాలా గొప్పది అని కామెంట్లు పెడుతున్నారు.వివరాల్లోకి వెళితే… ఇటీవల టర్కీలో థియేట్రికల్ నాటకం వేశారు.
ఈ డ్రామాలో భాగంగా నటుడు ఉజున్సోయ్ నేలపై పడుకుని స్క్రిప్ట్ ప్రకారం యాక్ట్ చేయడం ప్రారంభించాడు.
బాగా గాయాలైనట్లు ఫీలవుతూ అతడు చాలా బాధను వ్యక్తపరిచాడు.
వేగంగా వెళ్తున్న గుర్రం పైనుంచి కింద పడితే ఎంత గాయాలవుతాయో ఊహించుకొని మరీ అతడు ఆవేదన వ్యక్తం చేశాడు.ఉజున్సోయ్ నేలపై పడుకుని యాక్ట్ చేస్తుండటం ఒక కుక్క చూసింది.
అయితే అతడికి నిజంగానే దెబ్బ తగిలింది ఏమోనని, చనిపోతున్నాడేనని ఆ కుక్క బాగా బాధ పడింది.అంతేకాదు అతడికి బాధ తగ్గించేందుకు, వీలైతే బతికించేందుకు ట్రై చేయాలని నిశ్చయించుకుంది.
అలా ఆ కుక్క ఈ సీన్ లోకి ఎంట్రీ ఇచ్చి నాటకానికి అంతరాయం కలిగించింది.

ఈ వీధికుక్క ఆ నటుడి పక్కనే కూర్చుని అతడిని నాకుతూ తన ప్రేమను చూపించింది.“నీకేం కాదు, నీకు నేనున్నా ” అన్నట్లు అది అతడిని హత్తుకొని అందరినీ ఆశ్చర్య పరిచింది.దీని గురించి తెలుసుకున్న నెటిజన్లు ఎమోషనల్ అవుతున్నారు.
పాపం, ఈ వీధి కుక్కని ఎవరో ఒకరు దత్తత తీసుకుని దానికి ఒక మంచి లైఫ్ అందిస్తే బాగుండు అని చాలామంది కామెంట్లు చేశారు.అయితే దీనిని ఇప్పటికే అడాప్ట్ చేసుకొని ఉంటారని తెలుస్తోంది.







