ఆస్ట్రేలియా ప్రతిష్టాత్మక అవార్డ్ అందుకున్న భారతీయురాలు...!!!

విదేశాలలో ఉంటున్న ఎంతో మంది భారతీయులు తమ ప్రతిభతో ఇండియాకి ఎంతో గుర్తింపు తీసుకువస్తున్నారు.అనేక రంగాలలో భారతీయుల సత్తా చాటి చూపుతున్నారు.

విదేశాలలో ఉన్నత ఉద్యోగాలలో మాత్రమే కాకుండా సేవా, పర్యావరణ పరిరక్షణలో సైతం భారతీయులు తమ విశ్వాసాన్ని చూపిస్తున్నారు.ఈ క్రమంలోనే ఆస్ట్రేలియాలో భారత సంతతి మహిళకి అరుదైన గుర్తింపు లభించింది.

భారత సంతతికి చెందిన తెలుగు ఎన్నారై సంధ్యారెడ్డి కి ఆస్ట్రేలియాలో ప్రతిష్టాత్మక అవార్డ్ అయిన స్ట్రాత్ ఫీల్డ్ సిటిజన్ ఆఫ్ ది ఇయర్ 2020 అవార్డ్ కి ఎంపిక అయ్యింది.అయితే ఈ అవార్డు అందుకున్న తొలి భారతీయ మహిళ గా ఆమె రికార్డ్ క్రియేట్ చేశారు.

ఈ అవార్డ్ ను ఆమెకి సమాజసేవతో పాటు పర్యావరణ పరిరక్షణ కోసం ఎంతో కృషి చేసినందుకు గాను అందించారు.

Advertisement

పిల్లలని స్కూల్ లో చేర్చేలా కృషి చేయడం, పర్యావరణం పై అవగాహన కల్పిస్తూ మొక్కలు నాటించడం, రక్త దాన శిబిరాలు ఏర్పాటు చేయడం, స్వచ్ఛత విషయంలో ప్రజలందరికీ తెలిసేలా కార్యక్రమాలు ఏర్పాటు చేయడం, పిల్లలకి చదరంగం పోటీలు, ఆటలు పోటీలు నిర్వహించడం, ఆస్ట్రేలియా వచ్చే కొత్తవారికి సూచనలు ఇవ్వడం ఇలాంటి ఎన్నో సేవా కార్యక్రమాలు చేపట్టినందుకుగాను ఆమెకి ఈ పురస్కారాన్ని అందించారు.

నిజ్జర్ హత్య కేసు : ఆ నలుగురు భారతీయులు కస్టడీలోనే, మళ్లీ నోరు పారేసుకున్న కెనడా
Advertisement

తాజా వార్తలు