మనస్తత్వ శాస్త్రం అనేది చాలా ఆసక్తికరమైన అంశం.మనిషి ప్రవర్తన నిరంతరం అన్వేషణ దిశగా సాగుతుంది.
మన మనస్తత్వానికి సంబంధించి మనకే తెలియని అనేక విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.ఉత్తమ సలహా ఇచ్చే వ్యక్తులు సాధారణంగా చాలా ఇబ్బందుల్లో పడతారట.
ఎవరికైనా రాయడానికి కొత్త పెన్ను ఇచ్చినప్పుడు 17 శాతం మంది ముందుగా తమ పేరును రాస్తారు.మన మెదడు చాలావరకూ పాత జ్ఞాపకాలను పునరావృతం చేస్తూనే ఉంటుంది.
తెలివైన వ్యక్తులు తక్కువ స్నేహితులను కలిగి ఉంటారు.ఒక వ్యక్తి ఎంత తెలివిగా ఉంటాడో అతను మరింతగా ఎంపిక చేసుకుంటాడు.
హాస్యనటులు ఇతరులకన్నా ఎక్కువ విచారంగా ఉంటారు.ఎక్కువసేపు ఒంటరిగా ఉండడం.
రోజుకు 15 సిగరెట్లు తాగినంత హానికరం.
అధిక ఐక్యూ కలిగిన అమ్మాయిలు జీవిత భాగస్వామిని ఎంపికచేసుకోవడంలో మరింత సమస్యను ఎదుర్కొంటారు.
మనం బిజీగా ఉన్నప్పుడే సంతోషంగా ఉంటాం.మనం ఒకేసారి మూడు,నాలుగు విషయాలు మాత్రమే గుర్తుంచుకోగలం.
మనం కనే కలలలో 90 శాతం కలలను మరచిపోతాం.కేవలం 2శాతం మంది మహిళలు మాత్రమే తమను తాము అందంగా ఉన్నామని అభివర్ణించుకుంటారు.
మీరు ఎవరినైనా ఇష్టపడుతున్నారా లేదా అని నిర్ణయించుకోవడానికి 4 నిమిషాలు మాత్రమే పడుతుందట.మనం సంతోషంగా ఉన్నప్పుడు మనకు తక్కువ నిద్ర వస్తుంది.
మనం పగటిపూట కంటే రాత్రిపూట సులభంగా ఏడవగలం.