విచిత్రం.. ఆ ఊరి నిండా స‌మాధులే.. ఎక్క‌డంటే

ఆ ఊరి నిండా స‌మాధులే. ప్రతి ఇంటి ముందు ఒక్క‌టైన ఒక ఘోరీ ఉంటుంది.

ఆడవాళ్లు వాటి మధ్యే నుంచే నీళ్లు మోసుకుంటూ వెళ్తుంటారు.పిల్లలు అక్కడే ఆడుకుంటు ఉంటారు.

గుడి, బడి, అన్న తేడా లేదు.ఆ గ్రామం మధ్యలో సమాధులు ఉన్నాయా.

సమాధుల మధ్య ఆ ఊరుందో అర్థం కానీ వింత పరిస్థ‌తి.అక్కడి వారికి అవే సర్వస్వం.

Advertisement

అక్కడివరెవరూ.ప‌ట్టు మంచాల మీద పడుకోరట.

అలా పడుకుంటే కీడు జరుగుతుంద‌ని వారి న‌మ్మ‌కం ఇంతకీ యాడ ఉందా అని అనుకుంటున్నారా ఆ ఊరు.? ఏంటి ఆ కథ? ఇప్పుడు తెలుసుకుందాం.ఈ సమాధుల ఊరు కర్నూలు నుంచి పడమటి వైపున 66 కిలోమీటర్ల దూరంలో గోనెగండ్ల మండలంలోని గంజిహల్లి పంచాయ‌తీ పరిధిలో ఉంది.

ఈ ఊరు పేరు అయ్యకొండ.పేరుకు తగ్గట్టుగానే కొండమీద ఉంది ఈ ఊరు.ఇక్కడ సుమారుగా వంద ఇండ్లు, మూడు వందల దాకా జనాభా ఉంటుంది.ఇక్కడ ఏ ఇంటి ముందు చూసిన సమాధులే దర్శనమిస్తుంటాయి.

నిత్య నైవేద్యాలు సమాధుల ముందు పెడతారు.ఏం వండినా మొద‌ట నైవేద్యం పెట్టిన తర్వాతే ఇంట్లోని వాళ్లు తినాలి.

ఇదేందయ్యా ఇది.. బాయ్‌ఫ్రెండ్‌పై కోపంతో ఇలా కూడా చేస్తారా..??
వైరల్ వీడియో : టీ20 వరల్డ్ కప్ జట్టును ప్రకటించిన చిన్నారులు..

లేకుంటే కీడు జరుగుతుందని వీళ్ల నమ్మకం.

Advertisement

తమకు అవసరమైన నిత్యవసరాలు, రేషన్‌ సరుకుల కోసం, పింఛన్ల కోసం, సంతకు కొండకింద ఉన్న గంజిహల్లికి వెళ్లాల్సిందే.ఈ ఊరులో ఎన్నో వింత సాంప్ర‌దాయాలు ఉన్నాయి.ఈ ఊరిలోని వారు ఇక్కడి వారినే పెళ్లి చేసుకోవాలి.

ఈ గ్రామస్థులతోనే పెళ్లి సంబంధాలు కుదుర్చుకుంటారు.బయటి సంబంధాలు చేసుకోరు.ఇక్కడ అందరూ చాలా కష్టపడి పని చేస్తారు.80శాతం మందికి వీరిలో కొండకింద భూములున్నాయి.కొర్రలు, సజ్జలు, పల్లీ, మిరప, ఉల్లి వంటి పంటలు పండిస్తారు.

తాజా వార్తలు