ఆ ప్రాంతంలో వింత ఆచారం.. పేడ‌తో కొట్టుకుంటున్న గ్రామ‌స్తులు

ఈ ప్ర‌పంచంలో ఒక్కో చోట ఒక్కో ర‌క‌మైన సంప్ర‌దాయాలు ఉంటాయి.కొన్ని చోట్ల పండుగ‌లు చాలా చిత్ర విచిత్రంగా జ‌రుపుకుంటారు.

అంతెందుకు మ‌న దేశంలో కూడా చాలా ర‌కాల వింత ఆచారాలు ఉన్నాయి.మ‌న దేశంలో ముందే న‌మ్మ‌కాలు చాలా ఎక్కువ‌.

ప్ర‌కృతిని పూజించే దేశంగా ఉండ‌టంతో ఇలాంటి వింత ఆచారాల‌కు ఎక్కువ అవ‌కాశాలు ఉన్నాయి.అయితే ఇలాంటి వింత ఆచారాల్లో కొన్ని ఫ‌న్నీగా ఉంటే మ‌రికొన్ని మాత్రం ప్రాణాంత‌క‌రంగా ఉంటాయి.

కొన్ని చోట్ల క‌ర్ర‌ల‌తో కొట్టుకుంటున్న ఘ‌ట‌న‌లు కూడా మ‌నం చూస్తున్నాం.ఇప్పుడు కూడా ఇలాంటి ఓ వింత ఆచారం గురించే తెలుసుకుందాం.

Advertisement
Strange Custom In The Area. Villagers Beating With Dung, Strange Custom, Beating

మ‌న ప‌క్క‌నే ఉన్న కర్ణాటక అలాగే తమిళనాడు రాష్ట్రాల బార్డ‌ర్ లో ఉన్న‌టువంటి గుమటాపుర ఊరులో ఓ వింత ఆచారం ఉంది.ఇది విన‌డానికి కూడా చాలా వింత‌గా ఉంటుది.

ఈ ఊరిలో ఉన్న గుడిలోకి దీపావ‌ళి సంద‌ర్భంగా వెళ్లాలంటే వారు ఓ వింత సాంప్ర‌దాయాన్ని పాటిస్తారు.గుడిలోకి వెళ్లేమందు పెద్ద ఎత్తున ఆవుపేడను సేక‌రిస్తారు.

ఇలా సేక‌రించిన ఆవు పేడ‌ను వారంతా ఊరు మ‌ధ్య‌లో వేస్తారు.ఇక దీని ద‌గ్గ‌ర‌కు మగవాళ్లంతా పెద్ద ఎత్తున చేరుకుంటారు.

Strange Custom In The Area. Villagers Beating With Dung, Strange Custom, Beating

గుమటాపురంలోని వారంతా కూడా పేడ‌లో ఆటాడ‌టం మొద‌లు పెడ‌తారు‌.ఈ క్ర‌మ‌లోనే ఒక‌రిపై ఒక‌రు పేడ‌తో కొట్టుకుంటారు.అయితే ఇందులో సీరియ‌స్ నెస్ అనేది ఉండదు.

నా హైట్ తో సమస్య.. నాతో మాట్లాడేవాళ్లు కాదు.. మీనాక్షి చౌదరి షాకింగ్ కామెంట్స్ వైరల్!
వైరల్ వీడియో.. అరె పిల్లలు అది డాన్స్ ఫ్లోర్ కాదరయ్యా.. క్రికెట్ మ్యాచ్!

కేవ‌లం స‌ర‌దాగానే సాగుతుంది.అయితే ఇందులో త‌మ‌కు ఆరోగ్య ప్రయోజనాలు ఎక్కువ‌గా ఉంటాయ‌ని అందుకే ఇలా చేస్తున్నామ‌ని చెబుతున్నారు.

Advertisement

తాము పేడ‌ల‌తో కొట్టుకుంటే ఎలాంటి వ్యాధులు ఉన్నా స‌రే ఇట్టే త‌గ్గిపోతాయ‌ని చెబుత‌న్నారు.తాము ఈ సాంప్ర‌దాయ‌న్ని ద‌శాబ్ధాలుగా సాగిస్తున్నామ‌ని తాము ఎంతో ఆరోగ్యంగా ఉంటున్నామ‌ని చెబుతున్నారు.

ఈ వార్త ఇప్పుడు నెట్టింట తెగ వైర‌ల్ అవుతోంది.

తాజా వార్తలు