ఒక్క క్షణం విలువ దాన్ని కోల్పోయిన వారిని అడిగితే తెలుస్తుందని అంటుంటారు.అలాంటిది ఒక్క క్షణంలో రెప్పపాటున ఓ పసివాడి ప్రాణాన్ని కాపాడాడు ఓ వ్యక్తి.
ఓ దుకాణంలో క్యాష్ కౌంటర్‌పై నుండి పడబోయిన ఓ చిన్నపిల్లాడిన సదరు షాపు యజమాని పట్టుకోవడంతో ఆ బుడతడు బతికి బట్టకట్టాడు.అమెరికాలోని యూటా రాష్ట్రంలో జరిగిన ఈ ఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఇద్దరు మహిళలు చంటిబిడ్డతో ఓ షాపుకు వెళ్లారు.అక్కడ అతడిని క్యాష్ కౌంటర్‌పై కూర్చోబెట్టి సేల్స్‌గర్ల్‌తో ముచ్చట్లు సాగించారు.
కాగా ఇదే క్షణంలో ఆ బుడతడు అదుపు తప్పి కిందపడిపోయాడు.దీన్ని వారు గమనించలేకపోయారు.
అప్పుడే అటువైపు వస్తున్న షాపు యజమాని ఆ పిల్లాడిని గమనించి పరిగెత్తుకుంటూ వచ్చి తన చేతులతో పట్టుకున్నాడు.దీంతో ముగ్గురు మహిళలు కూడా అవాక్కయ్యారు.
తమ బిడ్డ ప్రాణాలు కాపాడినందుకు ఆ ఇద్దరు మహిళలకు సదరు షాపు యజమానికి కృతజ్ఞతలు తెలిపారు.ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లు ఆ మహిళలపై విరుచుకుపడుతున్నారు.
పిల్లాడిని కనిపెట్టలేని ఆ మహిళలు అతడిని షాపుకు ఎందుకు తీసుకెళ్లారంటూ కామెంట్లు విసురుతుండగా, మరికొందరు ఆ షాపు యజమానిని పొగడ్తలతో ముంచెత్తుతున్నారు.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy