తెర మీదకు అయేషా మీరా హత్య కేసు ! డెడ్ బాడీకి రీ పోస్టుమార్టం ?

దేశవ్యాప్తంగా దిశా హత్యాచార సంఘటన కలకలం రేపిన సంగతి తెలిసిందే.ఈ ఘటన తరువాత ఆడవాళ్ల రక్షణకు కఠినమైన చట్టాలను తీసుకురావాలనే డిమాండ్ తెరమీదకు వచ్చింది.

 Ayesha Meera Case Cbi Seeks To Echume Body For Re Post Mortem-TeluguStop.com

ఆ దిశగా కొన్ని రాష్ట్రాలు అడుగులు వేస్తున్నాయి.ఏపీ ప్రభుత్వం కూడా ఆడవాళ్లపై హత్యచారాలు చేస్తే ఉరి తీసేలా చట్టాన్ని కూడా తీసుకువచ్చి తమ చిత్తశుద్ధిని నిరూపించుకుంది.

ఇక మిగతా రాష్ట్రాల్లో కూడా ఇదే తరహాలో చట్టాలు చేయాలనే డిమాండ్ తెరమీదకు వస్తోంది.దిశ సంఘటనలో నిందితులు ఎన్‌కౌంటర్‌లో చనిపోవడంతో మెజార్టీ ప్రజలు ఆనందాన్ని వ్యక్తం చేశారు.

కానీ డబ్బున్న బడాబాబులు, రాజకీయ నేతల కొడుకులు కూడా తప్పులు చేస్తే పోలీసులు,ప్రభుత్వం అదే విధంగా వ్యవహరిస్తారా అనే ప్రశ్నలు కూడా తెరమీదకు వచ్చాయి.

ఏపీలో విమెన్ సేఫ్టీ చట్టంలో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చే చారిత్రాత్మక బిల్లుకు క్యాబినెట్ ఆమోదం తెలిపిన నేపథ్యంలో 12 ఏళ్ల క్రితం సంచలనం సృష్టించిన ఆయేషా మీరా అత్యాచారం, హత్య కేసు విషయంలో సీబీఐ కూడా దూకుడుగా నిర్ణయాలు తీసుకుంటుంది.

త్వరలోనే ఆయేషా మీరా డెడ్‌బాడీకి రీ పోస్టుమార్టమ్‌ చేయాలని భావిస్తోంది.ఈ మేరకు సీబీఐ ఏపీ పోలీసుల సలహాలు తీసుకుంటోంది.

అంతేకాదు డిశంబర్ 20 వ తేదీలోగా రీ పోస్టుమార్టం చేయాలని చూస్తోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube