ఇది నినాదమా? పిలుపా? ఏదనుకుంటే అది.వాస్తవానికి రెండూ కూడా.
దీన్ని హితోపదేశం అని కూడా అనుకోవచ్చు.ఈ ‘గీత బోధ’ చేసిన శ్రీకృష్ణ పరమాత్మ ఎవరు? అర్జనుడు ఎవరు? ఇద్దరూ సినిమా వాళ్లే.కృష్ణ పరమాత్మ దర్శకుడు రాంగోపాల్ వర్మ.అర్జనుడు ‘పవర్ స్టార్’ పవన్ కళ్యాణ్.మొన్న పవన్ కళ్యాణ్ రాక రాక మీడియా ముందుకొచ్చి టీఆర్‌ఎస్‌ను, టీడీపీని, భాజపాను విమర్శించిన సంగతి తెలుసు.‘నొప్పింపక తానొవ్వక’…అనే తరహాలో అన్ని అంశాలపై దూకుడుగా, ఆగ్రహంగా, విసురుగా మాట్లాడారు.పవన్ వ్యాఖ్యలపై టీఆర్‌ఎస్ నాయకులు, టీడీపీ నాయకులు, భాజపా నేతలు…ఇలా అందరూ తమకు తోచిన రీతిలో స్పందించారు.టీఆర్‌ఎస్, టీడీపీ నాయకులు పవర్ స్టార్‌పై విరుచుకుపడ్డారు కూడా.
ఎప్పుడూ ఏదో ఒక అంశంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసే దర్శకుడు రాంగోపాల్ వర్మ కూడా నేరుగా మాట్లాడకుండా ‘ట్వీట్’ చేశాడు.పవన్ మాట్లాడిన తీరు ఆయనకు నచ్చనట్లుగా ఉంది.
ఏ విషయం మీదా స్పష్టంగా మాట్లాడకపోవడం ఇందుకు కారణం కావొచ్చు.ఒకరిని విమర్శించి, మరొకరి గురించి మాట్లాడకుండా ఉంటే ఇబ్బందులు ఎదురవుతాయని పవన్‌కు తెలుసు అందుకే మూడు పార్టీలనూ తిట్టిపోశాడు.
ఈ వైఖరి నచ్చని రాంగోపాల్ వర్మ పిల్లిలా నంగిగా వ్యవహరించొద్దని, పులిలా గర్జించాలని పవన్‌కు సలహా ఇచ్చాడు.పవర్ స్టార్ ఈ సలహా పాటిస్తాడా?
.