స్వల్ప ఒడిదుడుకుల మధ్య స్టాక్ మార్కెట్లు లాభాల్లో ముగిశాయి.వారాంతమైన ఉదయం ట్రేడింగ్ సానుకూలంగానే ప్రారంభం అయింది.
అనంతరం కాస్త సమయం మందకొడిగా సాగి.మధ్యాహ్నానికి సూచీలు నష్టాల్లోకి వెళ్లాయి.
అయితే, రూపాయి కోలుకుంటుడటం, అంతర్జాతీయంగా సానుకూల సంకేతాలు కనిపించడంతో కనిష్టాల వద్ద స్టాక్స్ కొనుగోళ్లకు మదుపరులు మొగ్గు చూపారు.ఈ క్రమంలో సూచీలు తిరిగి కోలుకున్నాయి.
అటు చమురు ధరలు స్వల్పంగా దిగిరావడం కూడా మార్కెట్లకు కలిసివచ్చిందని చెప్పొచ్చు.
ఉదయం 17,923 పాయింట్ల వద్ద నిఫ్టీలో ట్రేడింగ్ ప్రారంభం కాగా.
ఇంట్రాడేలో 17,925 నుంచి 17,786 పాయింట్ల మధ్య ఊగిసలాడింది.చివరికి 34.60 పాయింట్ల స్వల్ప లాభంతో 17,833 పాయింట్ల వద్ద ముగిసింది.ఇక సెన్సెక్స్ 60,045 పాయింట్లతో సానుకూలంగా ప్రారంభమైంది.
ఇంట్రాడేలో 60,119 పాయింట్ల నుంచి 59,634 పాయింట్ల మధ్య కదలాడింది.చివరికి 104.92 పాయింట్ల లాభంతో 59,793.14 వద్ద ముగిసింది.సెన్సెక్స్ 30లో టెక్ మహీంద్రా, ఇండస్ ఇండ్ బ్యాంక్, ఇన్ఫోసిస్, హెచ్‌సీఎల్ టెక్, మారుతి, టీసీఎస్, ఎస్ బీఐ, విప్రో, యాక్సిస్ బ్యాంక్, హెచ్ యూఎల్, ఐసీఐసీఐ బ్యాంక్, ఐటీసీ షేర్లు లాభాల్లో ముగిశాయి.