స్టేజిపై కాలా చష్మా పాటకు స్టెప్పులు.. కాన్వొకేషన్‌లో స్టూడెంట్ డ్యాన్స్ వైరల్!

సోషల్ మీడియాలో ఈమధ్యకాలంలో బాగా వైరల్ అవుతున్న పాట కాలా చష్మా పాట.కత్రినా కైఫ్, సిద్ధార్థ్ మల్హోత్రా జంటగా నటించిన ‘బార్‌ బార్‌ దేఖో’ సినిమాలోని ఈ పాట ఇటీవల కాలంలో సోషల్‌ మీడియాలో దుమ్ములేపుతోందన్న విషయం అందరికీ తెలిసినదే.2018లో వచ్చిన సినిమాలోని ఈ పాట అ‍ప్పట్లో ఓ సంచలనం.అయితే ఇదే సాంగ్ మ‌రోసారి ఇన్‌స్టాగ్రామ్‌లో ట్రెండ్‌ అవుతుండటం విశేషం.

 Steps To Kala Chashma Song On Stage Student Dance Viral In Convocation ,stage-TeluguStop.com

ఎవరిని చూసినా ఈ పాటపై రీల్స్‌ చేసి పోస్టు చేస్తున్నారు.కేవలం భారత్‌లోనే కాదు ఖండాంతరాలు దాటుకొని ఆఫ్రికన్‌ పిల్లలు కూడా కాలా చష్మా పాటకు డ్యాన్స్‌ చేశారంటే ఎంత పాపులర్‌ అయ్యిందో ఇక అర్థం చేసుకోవచ్చు.

ఇక ఈ పాటను అందరూ సరదాగా స్నేహితులతో ఫంక్షన్లు, పెళ్లిళ్లు వంటి వేడుకల్లో సెలిబ్రేట్ చేసుకుంటే, తాజాగా ఓ విద్యార్ధి వెరైటీగా త‌న కాన్వొకేష‌న్ సంద‌ర్భంగా స్టేజ్‌పై డ్యాన్స్‌ చేశాడు.ముంబైకు చెందిన “మహిర్‌ మల్హోత్రా” అనే విద్యార్థి డిగ్రీ పూర్తి చేసుకొని గ్రాడ్యుయేషన్‌ పట్టాను తీసుకునేందుకు స్టేజ్‌ మీదకు వెళ్తుంటాడు.

అందరూ చప్పట్లు కొడుతూ అతన్ని ప్రోత్సహిస్తుండగా.స్టైలిష్‌గా స్టేజ్‌పై కాలాచష్మా స్టెప్స్‌ వేశాడు.

దాంతో ఆడిటోరియం ఒక్కసారిగా దద్దరిల్లింది.అయితే ముందుగా మహిర్‌ నిజంగా పడిపోయాడేమోనని ఆనుకుంటారు.కానీ అతను సాంగ్‌లోని స్టెప్‌ వేశారని భావించి ఒక్కసరిగ్గా అక్కడ ఉన్నవారందరూ ఆశ్చర్యపోతారు.ఈ వీడియోను మహిర్‌ తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేశాడు.‘దయచేసి దీన్ని ప్రయత్నించవద్దు.నేను దీన్ని ప్రోత్సహించను’ అనే క్యాప్షన్‌తో షేర్‌ చేసిన ఈ వీడియో నెట్టింట్లో హల్‌చల్‌ చేస్తోంది.

ఇప్పటికే 30 లక్షలకు పైగా వ్యూవ్స్‌ వచ్చాయి.మహిర్‌ డ్యాన్స్ వీడియో నెటిజన్లను ఆకట్టుకుంటోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube