సినిమాల్లో నటిస్తూ కోట్లు సంపాదించినా, స్టార్స్ గా ఒక వెలుగు వెలుగుతున్న వారు ఎవరైనా సరే ఏదైనా రోడ్ మీద సాధారణ వ్యక్తిలా కనిపిస్తే ఇంకా ఏమైనా ఉందా? ఎదో జరగకూడని ఘనకార్యం జరిగిపోయినట్టుగా, సదరు సెలబ్రిటీ ఆస్తులను పోగొట్టుకొని రోడ్ మీదకు వచ్చినట్టుగా మీడియా లో కోకొల్లలుగా వార్తలు వస్తాయి.మరి ఎలాంటి ఆస్తులు పోకుండా, కేవలం సింప్లిసిటీ గా ఉండాలనే ఒకే ఒక కారణం తో కొంత మంది నటులు అతి సాధారణంగా బయట కనిపిస్తూ నిత్యావసర వస్తువులు, సరుకులు కొంటూ కనిపిస్తారు.ఆలా సింప్లిసిటీ తో వైరల్ అవుతన్న కొంత మంది నటీనటులు ఎవరో చూద్దాం.
సుజాత శివ కుమార్

ఈ నటి( Sujata Siva Kumar ) ఎక్కువగా తమిళ సినిమాల్లోనే కనిపితుంది.కమల్ పోతురాజు చిత్రం ద్వారా మొదటి సారి సినిమా ఇండస్ట్రీ కి వచ్చింది .పరుత్తివీరన్ చిత్రం ద్వారా మంచి నటిగా గుర్తింపు పొందింది.ఈ చిత్రంలో ప్రియమణి పాత్రలో నటించినందుకు గాను ఫిలిం ఫేర్ అవార్డు దక్కించుకుంది.ఈ మధ్య లో జై భీం సినిమాలో కూడా కనిపించింది.ఆమె చాల సినిమాల్లో నటించిన కూడా తన కుటుంబానికి కావాల్సిన కూరగాయలు, సరుకులు భర్తతో కలిసి స్కూటర్ మీద వచ్చి కొంటుంది.ఎందుకు ఇలా చేస్తున్నారు అని అడిగితే నేను ఇలాగె ఉంటాను.సినిమా స్టార్ అయితే ఏంటి అంటూ సమాధానం చెప్తుంది.
రవి బాబు

చలపతి రావు కొడుకు రవి బాబు( Ravi Babu ) టాలీవుడ్ లో నటుడిగా, నిర్మాతగా, దర్శకుడిగా బాగానే సెటిల్ అయ్యాడు.అయితే ప్రతి సండే మటన్ కొనడానికి రవి బాబు స్వయంగా వెళ్తాడు.పని వాళ్ళను పంపించి తెప్పించుకోవాల్సినంత లక్సరీ ఏముంది చెప్పండి అంటూ మీడియా కు చివాట్లు కూడా పెడతారు
హేమ సుందర్

400 కు పైగా సినిమాల్లో నటించిన సీనియర్ నటుడు హేమసుందర్( Hema Sundar ) తన రోజు వారి అవసరాల నిమిత్తం ఇంట్లో ఎన్నో కార్లు ఉన్నప్పటికీ స్కూటర్ పైన వెళ్ళడానికి ఇష్టపడతాడు.నా ఒక్కటి కోసం కారు ఎందుకు అండి ట్రాఫిక్ లో ఇరుక్కోవడానికి తప్ప అంటూ నవ్వుతు చెప్తారు.
వీళ్ళు మాత్రమే కాదు గతంలో ఎలక్షన్స్ టైం లో సైకిల్ పై వచ్చి ఓటు వేసి తాను ఎంత సింపుల్ అనే విషయాన్నీ చెప్పకనే చెప్పారు హీరో విజయ్.