సినిమా నిర్మాణం చాలా మంది కృషితో కూడుకున్న ఒక భారీ ప్రాజెక్ట్.నిర్మాత డబ్బు సమకూరిస్తే హీరో, దర్శకుడు, టెక్నిషియన్స్‌తో పాటు యూనిట్‌లోని ప్రతి ఒక్కరూ కష్టపడి సినిమాను పూర్తి చేస్తారు.
ఈ సినిమాతో కోట్లాది రూపాయలు వెనకేసుకోవాలని ప్రొడ్యూసర్ ఆశిస్తాడు.అయితే మూవీ యూనిట్ కృషి డబ్బుతో పాటు అదృష్టం ఉంటేనే లాభాలు గడించే అవకాశం ఉంటుంది.
కొన్ని సందర్భాల్లో సినిమా పూర్తయినా విడుదల కాకపోవచ్చు.దీనివల్ల నిర్మాత జేబుకి పెద్ద చిల్లు పడొచ్చు.
చిన్న సినిమాలకైతే డబ్బు లేకపోవడం, ప్రమోషన్స్ చేయలేకపోవడం తదితర కారణాల వల్ల ఈ సమస్య వస్తుంది.ఇక పెద్ద హీరోల సినిమాలు కూడా ఆగిపోతాయి.
వాటికి కారణాలు ఏవైనా ఉండొచ్చు.అలా ఆగిపోయిన పెద్ద సినిమాలేవో చూద్దాం.
• శాంతినివాసం
చిరంజీవి, మాధవి నటించిన శాంతినివాసం సినిమా( Shantinivasam Movie ) షూటింగ్‌తో పాటు పోస్ట్ ప్రొడక్షన్ కూడా పూర్తి చేసుకుంది.దురదృష్టవశాత్తు సరిగ్గా రిలీజ్ సమయంలో నిర్మాత మరణించడంతో ఆ సినిమా థియేటర్లలోకి రాకుండా ఆగిపోయింది.ఎవ్వరూ ఈ సినిమాను రిలీజ్ చేయలేదు.
• ఇంటింటా అన్నమయ్య:
‘అన్నమయ్య’ తర్వాత కె.రాఘవేంద్రరావు దర్శకత్వంలో రూపొందిన సినిమా ఇంటింటా అన్నమయ్య.( Intinta Annamaiah ) ఇది 2013లో విడుదల కావాల్సి ఉండగా వాయిదా పడింది.అప్పటి నుంచి ఈ సినిమా రిలీజ్ కాకుండా మిగిలిపోయింది.
• జాదు
7G బృందావన కాలనీ అనంతరం రవికృష్ణ హీరోగా నటించిన ‘జాదు’ సినిమా( Jadoo Movie ) తెలుగులో రిలీజ్ కాకపోయింది.తమిళ్‌లో ‘కేడీ’ పేరుతో విడుదలై విజయం సాధించినా, తెలుగులో మాత్రం అదృష్టం కలిసి రాలేదు.ఈ సినిమాలో ఇలియానా హీరోయిన్‌గా నటించింది.
ఆమె ‘దేవదాసు’, ‘పోకిరి’ వంటి బ్లాక్ బస్టర్ హిట్స్ తర్వాత కూడా రిలీజ్ చేయలేకపోయారు.ఆమెకున్న క్రేజ్ వల్ల ఈ సినిమాను చూసేందుకు ప్రేక్షకులు వచ్చి ఉండేవారు.
• అయినా ఇష్టం నువ్వు
సీనియర్ నరేష్ కుమారుడు నవీన్ హీరోగా, కీర్తి సురేష్ హీరోయిన్‌గా నటించిన ‘అయినా ఇష్టం నువ్వు’ 2016లో రిలీజ్ కావాల్సి ఉండగా వాయిదా పడింది.ప్రముఖ నిర్మాత చంటి అడ్డాల నిర్మించిన ఈ సినిమా ఇప్పటికీ రిలీజ్ కాకుండా మిగిలిపోయింది.
• భీమ
విక్రమ్, త్రిష నటించిన ‘భీమ’( Bheema ) తమిళంలో విజయం సాధించినప్పటికీ, తెలుగులో రిలీజ్ కాకపోయింది.తెలుగు వెర్షన్ పూర్తయినప్పటికీ, విడుదలకు నోచుకోలేదు.
• డి.కె.బోస్
సందీప్ కిషన్, నిషా అగర్వాల్ నటించిన ‘డి.కె.బోస్’( DK Bose ) 2013లో రిలీజ్ కావాల్సి ఉండగా, ఆగిపోయింది.కోవిడ్ సమయంలో ఓటీటీలో విడుదల చేయాలని ప్రయత్నించినా, ఫలించలేదు.
• కోతి కొమ్మచ్చి
రియల్‌స్టార్ శ్రీహరి తనయుడు మేఘాంశ్ హీరోగా ‘కోతి కొమ్మచ్చి’ సినిమా( Kothi Kommachi ) 2020లో రిలీజ్ చేయాలనుకున్నారు కానీ దానిని ఇప్పటికీ ప్రేక్షకుల ముందుకు తీసుకు రాలేకపోయారు.‘శతమానం భవతి’ ఫేమ్ సతీష్ వేగేశ్న దర్శకత్వం వహించిన ఈ సినిమా రిలీజ్ కోసం శ్రీహరి అభిమానులు ఎంతో వెయిట్ చేశారు కానీ వారికి నిరాశే ఎదురయింది.
• దటీజ్ మహాలక్ష్మీ
హిందీ సూపర్‌హిట్ ‘క్వీన్’కి రీమేక్.తమన్నా హీరోయిన్‌గా, సిద్ధు జొన్నలగడ్డ నటించిన ఈ సినిమా 2019లో విడుదల కావాల్సి ఉండగా, రాలేదు.
• ధ్రువనక్షత్రం
సూర్య హీరోగా ప్రారంభించిన ఈ సినిమాలో ఆ తర్వాత విక్రమ్ నటించారు.ఏడు దేశాల్లో షూటింగ్ జరిగిన ఈ సినిమా ఆర్థిక కారణాల వల్ల రిలీజ్ కాలేదు.
• నా పేరు శివ 2
కార్తీ, పా.రంజిత్ కాంబినేషన్‌లో రూపొందిన ‘మదరాసి’కి సీక్వెల్.డబ్బింగ్ పూర్తయినప్పటికీ ఈ సినిమా రిలీజ్ కాలేదు.