టాలీవుడ్ స్టార్ హీరోయిన్లలో ఒకరైన సమంత యశోద సినిమా బ్లాక్ బస్టర్ హిట్ తో మరో సక్సెస్ ను ఖాతాలో వేసుకుంది.ఈ ఏడాది అక్కినేని నాగార్జునకు ది ఘోస్ట్ సినిమా రిజల్ట్ తో షాక్ తగలగా నాగచైతన్య థాంక్యూ, లాల్ సింగ్ చడ్డా సినిమాలు కూడా ఆశించిన ఫలితాలను సొంతం చేసుకోలేదనే సంగతి తెలిసిందే.
ఈ సినిమాలకు ఆశించిన స్థాయిలో ఓపెనింగ్ కలెక్షన్లు కూడా రాలేదనే విషయం తెలిసిందే.
అయితే సమంత ప్రధాన పాత్రలో నటించిన సినిమాలకు మాత్రం చెప్పుకోదగ్గ స్థాయిలోనే కలెక్షన్లు వస్తున్నాయి.
ఒక విధంగా నాగార్జున, చైతన్యల కంటే సమంత మార్కెట్ ఎక్కువని నెటిజన్ల నుంచి కామెంట్లు వినిపిస్తున్నాయి.ఈ మధ్య కాలంలో సక్సెస్ రేట్ విషయంలో కూడా సమంత పైచేయి సాధించిందని మరి కొందరు కామెంట్లు చేస్తుండగా ఆ కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండటం గమనార్హం.
థాంక్యూ, ది ఘోస్ట్ ఫుల్ రన్ లో సాధించిన కలెక్షన్లను యశోద మూవీ సులువుగానే బ్రేక్ చేస్తుందనే కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.మెయిన్ థియేటర్లలో యశోద మూవీ అంచనాలకు మించి కలెక్షన్లను సొంతం చేసుకుంటూ ఉండటం ఫ్యాన్స్ కు ఎంతగానో సంతోషాన్ని కలిగిస్తుండటం గమనార్హం.
సమంత సినిమాలను భారీ బడ్జెట్ తో నిర్మించినా రికార్డ్ స్థాయిలో బిజినెస్ జరుగుతోంది.

సమంతకు ఇతర భాషల్లో కూడా నటిగా మంచి గుర్తింపు ఉండటం ఆమె కెరీర్ కు ఒక విధంగా ప్లస్ అవుతోంది.అక్కినేని అభిమానులు దూరమైనా సమంత మార్కెట్ ఏ మాత్రం తగ్గకపోవడం గమనార్హం.కెరీర్ ను సరిగ్గా ప్లాన్ చేసుకుంటే సమంత కెరీర్ పరంగా భారీ విజయాలను సొంతం చేసుకోవడం గ్యారంటీ అని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.
సమంత నటించిన శాకుంతలం సినిమా కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.







