మెగా పవర్ స్టార్ గా తనకంటూ ఒక మంచి గుర్తింపును సంపాదించుకున్న రామ్ చరణ్( Ram Charan ) ప్రస్తుతం పాన్ ఇండియా సబ్జెక్టులను ఎంచుకొని వరుస సినిమాలు చేస్తూ ముందుకు సాగుతున్నాడు.ఇక అందులో భాగంగానే శంకర్ డైరెక్షన్( Shankar ) లో చేస్తున్న గేమ్ చేంజర్ సినిమా( game changer movie ) షూటింగ్ చివరి దశకు చేరుకుంది.
ఇక ఈ సినిమాని ఈ సంవత్సరం రిలీజ్ చేసి భారీ బ్లాక్ బస్టర్ సక్సెస్ ని అందుకోవాలని ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది.ఇక ఈ సినిమా తర్వాత బుచ్చిబాబు డైరెక్షన్ లో చేస్తున్న సినిమా మీద ఎక్కువ ఫోకస్ చేయబోతున్నట్టుగా కూడా వార్తలైతే వస్తున్నాయి.
అయితే ఈ సినిమాలో ఒక కీలక పాత్ర కోసం తెలుగులో స్టార్ హీరోగా మంచి గుర్తింపును సంపాదించుకున్న రాజశేఖర్( Rajasekhar ) ని తీసుకోబోతున్నట్టుగా తెలుస్తుంది.ఇక ఇంతకుముందు ఈయన నితిన్ హీరోగా వచ్చిన ఎక్స్ ట్రా ఆర్డినరీ మ్యాన్( Extra ordinary man ) అనే సినిమాలో చేసినప్పటికీ ఆ పాత్ర ఆయనకి ఎంతవరకు యూస్ అవ్వలేదు.కాబట్టి ఇప్పుడు రామ్ చరణ్ తో జయబోయే సినిమాలో తనని తాను ప్రూవ్ చేసుకోవాలనే ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తుంది.మరి నిజంగానే రాజశేఖర్ బుచ్చిబాబు రామ్ చరణ్ కాంబో లో వచ్చే సినిమాలో నటిస్తున్నాడా లేదా అనే విషయాలు అఫీషియల్ గా తెలియాలంటే మరి కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే.
అయితే ఈ సినిమా ప్రొడ్యూసర్ గానీ, డైరెక్టర్ గాని అఫీషియల్ గా అనౌన్స్ చేస్తే తప్ప ఈ విషయాన్ని పరిగణలోకి తీసుకోరాదు అని మరికొంతమంది సీనియర్ సినీ మేధావులు సైతం వాళ్ళ అభిప్రాయాన్ని సోషల్ మీడియా వేదికగా తెలియజేస్తున్నారు.ఇక ఈ సినిమాలో కనక రాజశేఖర్ కి అవకాశం వచ్చినట్టయితే ఆయన క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా సినిమా ఇండస్ట్రీలో చాలా ఎక్కువ రోజుల పాటు కొనసాగే అవకాశాలు అయితే ఉన్నాయి.