తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలామంది నటులు వాళ్ళకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకోవడానికి అహర్నిశలు కష్టపడుతూ ఉంటారు.ఇక ఇలాంటి క్రమం లోనే వాళ్ళు చేసిన ప్రతి సినిమా మంచి విజయాన్ని అందుకోవాలని కోరుకుంటుంటారు.
ప్రభాస్ సలార్ సినిమాతో ఒక పెను సంచలనాన్ని సృష్టించాడనే చెప్పాలి.ఇక ఇప్పుడు రాజా సాబ్( The Raja Saab ) లాంటి సినిమాతో మరోసారి మన ముందుకు రాబోతున్నాడు.
ఇక ఇదంతా ఒకెత్తు అయితే ఇప్పుడు సలార్ 2 సినిమాతో మరోసారి ప్రభాస్ ప్రేక్షకులు ముందుకు రాబోతున్నాడు.

అయితే ఈ సినిమాలో మలయాళ ఇండస్ట్రీకి చెందిన మోహన్ లాల్( Mohanlal ) ప్రభాస్ తండ్రిగా నటించబోతున్నట్టుగా కూడా వార్తలైతే వస్తున్నాయి.ఇక ఈ సినిమాకు సంబంధించిన పూర్తి అప్డేట్ ని ఇంకా తెలియజేయనప్పటికీ ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం అయితే మోహన్ లాల్ ప్రభాస్ తండ్రిగా నటించే అవకాశాలైతే పుష్కలంగా ఉన్నాయి.ఇక ఆయనను తీసుకోవడం వల్ల మలయాళ మార్కెట్ కూడా చాలా వరకు ప్లస్ అవుతుందని తెలుస్తుంది.
ఇక ఇప్పటికే పృధ్వీరాజ్ సుకుమారన్ లాంటి హీరో మలయాళం ఇండస్ట్రీ నుంచి ఈ సినిమాలో ఉన్నప్పటికీ మోహన్ లాల్ తో కూడా ఒక అదిరిపోయే క్యారెక్టర్ చేయించబోతున్నట్టుగా తెలిసింది.

ఇక ఈ న్యూస్ తో ఈ సినిమా మీద మలయాళం లో మరింత బజ్ పెంచే ప్రయత్నం అయితే చేస్తున్నట్టుగా తెలుస్తుంది.అయితే ప్రశాంత్ నీల్( Prashanth Neel ) ప్రస్తుతం కమిట్ అయిన సినిమాలు అన్నీ పూర్తి అయిన తర్వాత ప్రభాస్ తో ఈ సినిమా చేయనున్నట్టు తెలుస్తుంది… ఇక ఏది ఏమైనా కూడా సలార్ సినిమాతో 800 కోట్ల వరకు కలెక్షన్స్ ను రాబట్టిన ఈ కాంబినేషన్ ఇప్పుడు సాలార్ 2 సినిమాతో దాదాపు 1,000 కోట్లకు పైన కలెక్షన్స్ ను రాబట్టాలనే ధృడ సంకల్పంతోనే ఆ సినిమాని తెరకెక్కించాలనే ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తుంది…
.