మెగా, అక్కినేని కుటుంబాలకు వివాహం అచ్చిరావట్లేదా.. విడాకుల వార్తలతో?

ఈ మధ్య కాలంలో సెలబ్రిటీల విడాకులకు సంబంధించి ఏ వార్త వచ్చినా ఆ వార్త నెట్టింట హాట్ టాపిక్ అవుతోంది.చైతన్య నిహారిక( Chaitanya Niharika ) విడాకులు తీసుకుంటామని చెప్పకపోయినా సోషల్ మీడియా పోస్టుల ద్వారా తమ మధ్య గొడవలు జరుగుతున్నట్టు సంకేతాలు ఇచ్చారు.

 New Problems For Mega And Akkineini Families Details, Nagarjuna, Chiranjeevi, Me-TeluguStop.com

మెగా కుటుంబంలో కొంతమందికి వివాహం అచ్చిరావడం లేదని కామెంట్లు వ్యక్తమవుతూ ఉన్నాయి.మెగా కుటుంబానికి చెందిన పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) వేర్వేరు కారణాల వల్ల మొదటి భార్య, రెండో భార్యకు విడాకులు ఇచ్చారు.

చిరంజీవి ( Chiranjeevi ) పెద్ద కూతురు సుస్మిత ఉదయ్ కిరణ్ పెళ్లి కొన్ని కారణాల వల్ల ఆగిపోయిందనే సంగతి తెలిసిందే.శ్రీజ ( Srija ) వ్యక్తిగత జీవితం కూడా అనేక వివాదాల్లో చిక్కుకుంది.

ఆమె కళ్యాణ్ దేవ్ కు కూడా విడాకులు ఇవ్వబోతుందని వార్తలు ప్రచారంలోకి వచ్చాయి.నిహారిక గురించి కూడా ఇదే తరహా వార్తలు ప్రచారంలోకి రావడం గమనార్హం.మరోవైపు అక్కినేని కుటుంబంలో కూడా ఇవే తరహా ఘటనలు చోటు చేసుకున్నాయ్.

నాగార్జున ( Nagarjuna ) మొదటి వివాహం లక్ష్మీతో జరగగా మొదటి భార్యతో నాగ్ విడాకులు తీసుకున్నారు.నాగచైతన్య సమంత కూడా విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే.అఖిల్ వివాహానికి సంబంధించి కూడా నిశ్చితార్థం తర్వాత పలు సమస్యలు ఎదురయ్యాయి.

సుమంత్ కూడా తన భార్యతో విడిపోయారనే సంగతి తెలిసిందే.మెగా, అక్కినేని కుటుంబాలకే ఈ విధంగా ఎందుకు జరుగుతుందో అర్థం కావడం లేదు.

మెగా, అక్కినేని కుటుంబాలకు ఇండస్ట్రీలో ఎంతో పేరుప్రఖ్యాతులు ఉండగా ఈ తరహా ఘటనల వల్ల పరువు పోతుందని కామెంట్లు వినిపిస్తున్నాయి.ప్రేమించి పెళ్లి చేసుకున్న జోడీలు సైతం విడిపోతూ ఉండటంతో నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు.నిహారిక విషయంలో వైరల్ అవుతున్న వార్తల గురించి మెగా ఫ్యామిలీ నుంచి స్పష్టత రావాల్సి ఉంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube