దేశంలోనే నంబర్2 స్థానంలో బసవతారకం ఆస్పత్రి.. బాలయ్య వల్లే సాధ్యమైందంటూ?

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఊహించని స్థాయిలో క్రేజ్ ఉన్న హీరోలలో బాలయ్య ( Balakrishna ) ఒకరు.ఊరమాస్ సినిమాలలో బాలయ్య నటించినంత అద్భుతంగా మరో స్టార్ హీరో నటించలేరని ఇండస్ట్రీలో టాక్ ఉంది.

 Star Hero Balakrishna Rare Achievement Basavatarakam Hospital Details, Balakrish-TeluguStop.com

డైలాగ్స్ చెప్పాలన్నా అద్భుతమైన యాక్షన్ సీన్స్ లో నటించాలన్నా బాలయ్యకు బాలయ్యే సాటి అని ఇండస్ట్రీలో తరచూ వినిపిస్తుంది.బాలయ్య ప్రస్తుతం అనిల్ రావిపూడి డైరెక్షన్ లో ఒక సినిమాలో నటిస్తున్నారు.

సాధారణంగా అనిల్ రావిపూడి( Anil Ravipudi ) సినిమాలు అంటే కామెడీ ప్రధానంగా తెరకెక్కుతాయనే సంగతి తెలిసిందే.అయితే బాలయ్య కోసం అనిల్ రావిపూడి రూట్ మార్చారని బాలయ్యను సింగిల్ రోల్ లోనే పవర్ ఫుల్ గా చూపించడానికి సిద్ధమాయ్యారని సమాచారం అందుతోంది.

దసరా టార్గెట్ గా ఈ మూవీ రిలీజ్ కానుండగా శ్రీలీల నటిస్తుండటం ఈ సినిమాకు ప్లస్ అవుతోంది.బోయపాటి రామ్ కాంబో మూవీలో కూడా శ్రీలీల హీరోయిన్ గా నటిస్తుండటం హాట్ టాపిక్ అవుతోంది.

Telugu Anil Ravipudi, Balakrishna, Basavatarakam, Reliance-Movie

అయితే బాలయ్య ఛైర్మన్ గా ఉన్న బసవతారకం ఆస్పత్రి( Basavatarakam Hospital ) గురించి అందరూ పాజిటివ్ గా చెబుతారనే సంగతి తెలిసిందే.క్యాన్సర్ చికిత్సకు ఈ ఆస్పత్రిలో ఇతర ఆస్పత్రులతో పోల్చి చూస్తే అతి తక్కువ ఖర్చుతో మెరుగైన వైద్యం అందుతుందని టాక్ ఉంది.అయితే ప్రముఖ మ్యాగజైన్ లలో ఒకటైన ఔట్ లుక్ ఒక సర్వేను నిర్వహించగా ఆ సర్వేలో ముంబైలో రిలయన్స్ ఫౌండేషన్ ఆస్పత్రి తొలి స్థానంలో నిలిస్తే బాలయ్య బసవతారకం ఆస్పత్రి రెండో స్థానంలో నిలిచింది.

Telugu Anil Ravipudi, Balakrishna, Basavatarakam, Reliance-Movie

ఔట్ లుక్ నుంచి బాలయ్య బసవతారకం ఆస్పత్రి నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాలను సైతం ప్రశంసించడం గమనార్హం.మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ ఆస్పత్రి సాధించిన అరుదైన ఘనత విషయంలో ప్రశంసలు వ్యక్తం చేశారు.బాలయ్య కెరీర్ విషయంలో అంతకంతకూ ఎదుగుతుండటం గమనార్హం.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube