స్టార్ హీరో నందమూరి బాలకృష్ణ ( Nandamuri Balakrishna )కొన్నేళ్ల క్రితం వరకు భారీ విజయాలను సొంతం చేసుకోలేదనే సంగతి తెలిసిందే.అఖండ సినిమా నుంచి బాలయ్యకు కెరీర్ పరంగా వరుస విజయాలు దక్కాయి.
అదే సమయంలో దర్శకుల ఎంపిక విషయంలో బాలయ్య మారారు.ప్రేక్షకులు తనను ఎలా చూడాలని కోరుకుంటున్నారో అలాంటి పాత్రలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం బాలయ్యకు వరమవుతోంది.
అయితే మరో యంగ్ డైరెక్టర్ కు బాలయ్య గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని సమాచారం అందుతోంది.తెలుగులో రెండు సినిమాలే చేసినా రాహుల్ సాంకృత్యాన్ ( Rahul Sankrityan ) దర్శకునిగా మంచి పేరు సంపాదించుకున్నారు.
టాక్సీవాలా, శ్యామ్ సింగరాయ్( Taxiwala, Shyam Singarai ) సినిమాలు రాహుల్ సాంకృత్యాన్ రేంజ్ అంతకంతకూ పెరుగుతోంది.రాహుల్ సాంకృత్యాన్ రెమ్యునరేషన్ సైతం ఒకింత భారీ రేంజ్ లో ఉంది.
బాలయ్య రాహుల్ కాంబినేషన్ క్రేజీ కాంబినేషన్ అని మరి కొందరు కామెంట్లు చేస్తున్నారు.ఈ కాంబో సినిమాను మైత్రీ నిర్మాతలు( mytri movies ) నిర్మించే అవకాశాలు ఉన్నాయని ప్రచారం జరుగుతుండగా ఆ ప్రచారంలో నిజానిజాలు తెలియాల్సి ఉంది.రాహుల్ సాంకృత్యాన్ బాలయ్య సినిమాతో హ్యాట్రిక్ సాధించాలని మరి కొందరు కామెంట్లు చేస్తుండటం గమనార్హం.బాలయ్య సినిమాలన్నీ 100 కోట్ల రూపాయల రేంజ్ బడ్జెట్ తో తెరకెక్కుతున్నాయని తెలుస్తోంది.
రాహుల్ సాంకృత్యాన్ వైవిధ్యమైన కథాంశంతో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారని సమాచారం అందుతోంది.బాలయ్య క్రేజ్ ఉన్న డైరెక్టర్లకు ఛాన్స్ ఇవ్వడం గురించి ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి.బాలయ్య రాబోయే రోజుల్లో కెరీర్ పరంగా మరిన్ని సంచలన విజయాలను సొంతం చేసుకోవాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు.సినిమా సినిమాకు లుక్ విషయంలో వైవిధ్యం చూపించడానికి బాలయ్య ఆసక్తి చూపిస్తున్నారు.
బాలయ్యను అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో బాలయ్య ఇండస్ట్రీ హిట్లు సాధించాలని కొంతమంది ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు.సోషల్ మీడియాలో సైతం బాలయ్య ఫోకస్ పెడుతున్నారు.