Amir khan bollywood : ఏమీ చేయలేక ఏడ్చేశాను.. స్టార్ హీరో అమీర్ ఖాన్ షాకింగ్ కామెంట్స్ వైరల్!

బాలీవుడ్ ప్రముఖ నటుడు అమీర్ ఖాన్ ఒక ఇంటర్వ్యూలో షాకింగ్ విషయాలను వెల్లడించగా ఆ విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.లాల్ సింగ్ చద్దా సినిమాతో అమీర్ ఖాన్ ఖాతాలో భారీ ఫ్లాప్ చేరిందనే సంగతి తెలిసిందే.

 Star Hero Amir Khan Comments Viral Details Here Goes Viral , Amir Khan, Bollyw-TeluguStop.com

ఈ సినిమా రిజల్ట్ తర్వాత అమీర్ ఖాన్ ఏ సినిమాలో కూడా నటించడం లేదు.తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న అమీర్ ఖాన్ ఆ ఇంటర్వ్యూలో షాకింగ్ విషయాలను వెల్లడించగా ఆ విషయాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

బాల్యంలో తాను ఎదుర్కొన్న గడ్డు పరిస్థితుల గురించి అమీర్ ఖాన్ చెప్పుకొచ్చారు.ఆరోజులు నాకు ఇంకా గుర్తున్నాయని ఆయన కామెంట్లు చేశారు.నాన్న లాకెట్ అనే సినిమాను నిర్మిస్తున్నారని ఆ సినిమాలో నటీనటులుగా సినీ ప్రముఖులను ఎంపిక చేయడం జరిగిందని అమీర్ ఖాన్ చెప్పుకొచ్చారు.అలా చేయడం వల్ల షూటింగ్ లు వాయిదా పడుతూ ఉండేవని ఆయన కామెంట్లు చేయడం గమనార్హం.

Telugu Amir Khan, Bollywood, Locket, Nagachaitanya-Movie

ఆ సినిమా పూర్తి కావడానికి ఎనిమిది సంవత్సరాల సమయం పట్టిందని ఆ సినిమా వల్ల మేము దాదాపుగా రోడ్డున పడే పరిస్థితి వచ్చిందని అమీర్ ఖాన్ పేర్కొన్నారు.అప్పులు ఇచ్చిన వాళ్లు డబ్బులు ఎప్పుడు ఇస్తావని అడిగేవారని చేతిలో డబ్బులు లేకపోవడంతో నటీనటులు మా నాన్నకు డేట్స్ ఇవ్వడం లేదని అమీర్ ఖాన్ పేర్కొన్నారు.సినిమా పూర్తైతే మాత్రమే డబ్బులు వస్తాయని నాన్న బ్రతిమాలేవారని అమీర్ ఖాన్ పేర్కొన్నారు.అయితే మా సమస్యలు వాళ్లకు అనవసరం కదా అని అమీర్ ఖాన్ తెలిపారు.

ఆ సమయంలో నేను పది సంవత్సరాల పిల్లాడినని ఆ సమయంలో ఏమీ చేయలేక మదనపడిపోయేవాడినని ఆయన చెప్పుకొచ్చారు.ప్రస్తుతం అమీర్ ఖాన్ స్పానిష్ మూవీ రీమేక్ లో నటిస్తున్నారు.2023 సంవత్సరంలో ఈ సినిమా షూట్ మొదలుకానుండగా ఈ సినిమాతో అమీర్ ఖాన్ సక్సెస్ సాధిస్తారో లేదో చూడాల్సి ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube