సూపర్ స్టార్ కృష్ణ జయంతి రోజున అంటే మే 31న సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న లేటెస్ట్ సినిమా నుండి అప్డేట్ ఉంటుంది అని ఇప్పటికే మేకర్స్ అనౌన్స్ మెంట్ ఇచ్చేసారు.ఈ విషయం చెప్పినప్పటి నుండి మహేష్ ఫ్యాన్స్ ఈ అప్డేట్ కోసం తెగ ఎదురు చూస్తున్నారు.
మహేష్ బాబు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబోలో తాజాగా తెరకెక్కుతున్న లేటెస్ట్ పాన్ ఇండియన్ మూవీ ”SSMB28”.
త్రివిక్రమ్ ( Trivikram )దర్శకత్వంలో తన 28వ సినిమాను ప్రకటించి పూర్తి చేస్తున్నాడు మహేష్.
ఈ సినిమా కోసం ఫ్యాన్స్ అంతా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.ఈ సినిమా నుండే రేపు మాసివ్ అప్డేట్ రాబోతుంది.
ఈ విషయాన్నీ ఇప్పటికే కన్ఫర్మ్ చేస్తూ మేకర్స్ అఫిషియల్ అప్డేట్ ఇచ్చారు.ఇక ఇప్పుడు ఈ మాస్ స్ట్రైక్ కోసం టైం ఫిక్స్ చేసినట్టు అఫిషియల్ గా తెలిపారు.

మరి రేపు కృష్ణ( Krishna ) గారి జయంతి కావడంతో ఈయన నటించిన మోసగాళ్లకు మోసగాడు సినిమా రీ రిలీజ్ చేస్తున్న విషయం తెలిసిందే.ఈ సినిమా రీ రిలీజ్ అవుతున్న థియేటర్స్ లో ఈ సినిమాతో కలిపి ఈ అప్డేట్ ను ఇవ్వబోతున్నారు.రేపు సాయంత్రం 6 గంటల 3 నిముషాలకు థియేటర్స్ లో మోసగాళ్లకు మోసగాడు రీ రిలీజ్ తో కలిపి రిలీజ్ చేయనున్నారు.

మరి ఈ బ్లాస్ట్ ఎలా పేలుతుందో చూడాలి.ఇక జగపతిబాబు కీలక రోల్ పోషిస్తున్నాడు.ఈ సినిమాను హారిక హాసిని బ్యానర్ పై ఎస్ రాధాకృష్ణ భారీ బడ్జెట్ తో నిర్మిస్తుండగా.
థమన్ సంగీతం అందిస్తున్నాడు.పూజా హెగ్డే, శ్రీలీల హీరోయిన్ లుగా నటిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 13న రిలీజ్ కానుంది.







