సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu) హీరోగా త్రివిక్రమ్ (Trivikram) శ్రీనివాస్ కాంబోలో తెరకెక్కుతున్న లేటెస్ట్ మోస్ట్ ఏవైటెడ్ మూవీ ”SSMB28”.టాలీవుడ్ నుండి ప్రెజెంట్ తెరకెక్కుతున్న పలు క్రేజీ కాంబోల్లో ఇది ఒకటి.ఈ కాంబోలో ప్రస్తుతం హ్యాట్రిక్ సినిమా తెరకెక్కుతుంది.మహేష్ బాబు కెరీర్ లో 28వ సినిమాగా రాబోతున్న ఈ సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి.
త్రివిక్రమ్ డైరెక్టర్ కావడంతో ఈ సినిమా పక్కా హిట్ అని ఫ్యాన్స్ రాసి పెట్టుకున్నారు.మరి త్రివిక్రమ్ కూడా వీరి అంచనాలకు తగినట్టుగానే సినిమాను తెరకెక్కిస్తున్నట్టు సమాచారం.SSMB28 అనే వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాను హారిక హాసిని బ్యానర్ పై ఎస్ రాధాకృష్ణ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.ప్రెజెంట్ ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది.

తాజాగా ఈ సినిమా షూట్ నుండి ఒక క్రేజీ అప్డేట్ బయటకు వచ్చింది.ఈ సినిమా కోసం భారీ ఖర్చుతో ఒక ఇంటి సెట్ ను వేసిన విషయం తెలిసిందే.ఇప్పటికే ఈ ఈ సెట్ లో కొన్ని సన్నివేశాలను తెరకెక్కించారు.ఇక ఇప్పుడు ఈ ఇంటి సెట్ లోనే షూట్ జరగబోతుంది అని తెలుస్తుంది.ఈ ఇంటి సెట్ లో నైట్ టైం షూట్ చేయడానికి రెడీ అవుతున్నారట.

కీలక తారాగణం పాల్గొనబోతున్న ఈ షెడ్యూల్ తర్వాత మిగిలిన బ్యాలెన్స్ షూట్ వేగంగా పూర్తి చేసేందుకు యూనిట్ సన్నాహాలు చేస్తున్నట్టు తెలుస్తుంది.ఇక ఈ సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా రిలీజ్ చేయనున్నట్టు టాక్.ఇదిలా ఉండగా ఈ సినిమాలో మహేష్ కు జోడీగా పూజా హెగ్డే (Pooja Hegde), శ్రీలీల (Sreeleela)హీరోయిన్ లుగా నటిస్తుండగా.
జగపతిబాబు (Jagapathi Babu) నెగిటివ్ రోల్ లో నటిస్తున్నాడు.







