దర్శక ధీరుడు రాజమౌళి మహేష్ బాబుతో సినిమా చేయబోతున్న విషయం తెలిసిందే.రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ సినిమా అయ్యి బ్లాక్ బస్టర్ విజయం సాధించింది.
ఈ సినిమాలో రామ్ చరణ్, ఎన్టీఆర్ ఇద్దరు ప్రధాన పాత్రల్లో నటించారు.ఇక ఇప్పుడు రాజమౌళి ఫుల్ ఫోకస్ అంతా మహేష్ బాబు సినిమాపై పెట్టాడు.
రాజమౌళి మహేష్ బాబుతో ఒక భారీ అడ్వెంచర్ సినిమాను తెర మీదకు తీసుకు రాబోతున్నాడు.ఈ సినిమాపై ప్రేక్షకులు కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.మహేష్ బాబు క్లాస్ హీరో కాబట్టి మహేష్ బాబు ను ఎలా చూపిస్తాడు అనే ఆసక్తి అందరిలో నెలకొంది.ఈ సినిమాకు సంబంధించిన ఆసక్తికర విషయం ఒకటి బయటకు వచ్చింది.
ఈ సినిమాను SSMB29 అనే వర్కింగ్ టైటిల్ తో స్టార్ట్ చేయనున్నారు.
అయితే ఈ సినిమా ఇంకా స్టార్ట్ కాక ముందే రకరకాల రూమర్స్ వినిపిస్తూనే ఉన్నాయి.
ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ దీపికా పడుకొనే, విలన్ గా సంజయ్ దత్ నటించ బోతున్నట్టు ఎప్పటి నుండో రూమర్స్ వస్తూనే ఉన్నాయి.ఇక తాజాగా మరో కొత్త రూమర్ నెట్టింట వైరల్ అవుతుంది.
అది ఏంటంటే.ఈ సినిమాలో మహేష్ బాబుకి తండ్రిగా బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ నటించ బోతున్నట్టు పుకార్లు షికార్లు చేస్తున్నాయి.
అయితే రాజమౌళి ఇంత వరకు నటీనటుల ఎంపిక చేయలేదు.కానీ ఈ సినిమా కథ ప్రకారం తండ్రి పాత్ర చాలా కీలకం అని అందుకే ఈ పాత్రలో అమితాబ్ బచ్చన్ నటిస్తే బాగుంటుంది అని టీమ్ భావిస్తోందట.ఇంకా ఇది ఫైనల్ అయితే కాలేదు.ప్రెజెంట్ మహేష్ త్రివిక్రమ్ సినిమాతో బిజీగా ఉన్నాడు.ఈ సినిమా పూర్తి చేసి కొద్దీ సమయం రెస్ట్ తర్వాతనే రాజమౌళి సినిమాలో జాయిన్ కానున్నట్టు సమాచారం.