Srimukhi Gangubai : గంగుబాయ్ అవతారం ఎత్తిన శ్రీముఖి.. వైరల్ అవుతున్న ఫోటో?

బుల్లితెరపై ఎన్నో కార్యక్రమాలు ప్రసారం అవుతు పెద్ద ఎత్తున ప్రేక్షకులను సందడి చేస్తున్నాయి.

ఈ క్రమంలోనే ప్రస్తుతం ప్రతి ఒక్క ఛానల్లో కూడా ఎన్నో వినోదాత్మకత కార్యక్రమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి.

ఇకపోతే ఈటీవీలో సరికొత్తగా ప్రారంభమైన మిస్టర్ అండ్ మిసెస్ కార్యక్రమం కూడా ఎంతో మంచి ఆదరణ సొంతం చేసుకుంటుంది.ఈ కార్యక్రమానికి శివబాలాజీతో పాటు హీరోయిన్ స్నేహ జడ్జిలుగా వ్యవహరిస్తున్నారు.

ఇక ఈ కార్యక్రమానికి బుల్లితెర రాములమ్మగా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న శ్రీముఖి వ్యాఖ్యాతగా వ్యవహరిస్తుంది.ప్రతివారం అభిమానులను ఎంతో ఎంటర్టైన్ చేసే శ్రీముఖి ఈ వారం సరికొత్త వేషధారణలో ప్రేక్షకుల ముందుకు వచ్చారు.

వచ్చేవారం ప్రసారం కాబోయే కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో విడుదల చేయక ప్రస్తుతం ఈ ప్రోమో వైరల్ గా మారింది.అయితే ఈ ప్రోమోలో శ్రీముఖి వేషధారణ మాత్రం అందరిని ఎంతగానో ఆకట్టుకుంటుంది.

Advertisement

ఈసారి శ్రీముఖి ఎంతో విభిన్నంగా బాలీవుడ్ నటి అలియా భట్ నటించిన గంగుబాయ్ వేషధారణలో ప్రేక్షకుల ముందుకు వచ్చారు.

అచ్చం నటి ఆలియా భట్ ను తలపించే విధంగా తెలుపు రంగు చీర కట్టుకొని నుదుటిన ఎర్రబొట్టు నల్లటి కళ్ళజోడుతో శ్రీముఖి అచ్చం గంగుబాయ్ నీ తలపించారు.ఇక ఈ ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఎంతోమంది నెటిజన్ లు గంగుబాయ్ వేషధారణ అలియా భట్ కన్నా శ్రీముఖికి ఎంతో అద్భుతంగా ఉందని కామెంట్లు చేస్తున్నారు.ప్రస్తుతం ఈ ప్రోమో వైరల్ అవుతుంది.

ఇక శ్రీముఖి ఈ కార్యక్రమం మాత్రమే కాకుండా బుల్లితెర ప్రతి ఒక్క ఛానల్లోనూ ఏదో ఒక కార్యక్రమం ద్వారా బుల్లితెర ప్రేక్షకులకు సందడి చేస్తుంది.

ఎలాన్ మస్క్ కూడా కాపీ కొడతాడా.. ఆ డైరెక్టర్ సంచలన ఆరోపణలు..?
Advertisement

తాజా వార్తలు