తెలుగు బిగ్ బాస్ సీజన్ 4 ఫైనల్ వారంకు చేరుకుంది.ఈ వారం పెద్దగా టాస్క్‌లు ఏమీ ఉండవు.
కంటెస్టెంట్స్ పూర్తిగా రిలాక్స్ అవ్వడంతో పాటు వారిని చిల్ చేసేందుకు బిగ్ బాస్ పాత కంటెస్టెంట్ లను మరియు ప్రత్యేకమైన వ్యక్తులతో కంటెస్టెంట్స్ తో మాట్లాడటం జరుగుతోంది.నిన్నటి ఎపిసోడ్ లో పాత సీజన్ ల టాప్ కంటెస్టెంట్స్ అయిన గీత మాధురి, హరితేజ, శ్రీముఖి మరియు అలీ రేజాలను తీసుకు వచ్చారు.
వీరు నలుగురు ఇంట్లో ఉన్న అయిదుగురు సభ్యులతో సందడి చేశారు.గంట పాటు సాగిన ఎపిసోడ్ లో ఎక్కువ శాతం కంటెస్టెంట్స్ తో మాజీ కంటెస్టెంట్స్ సరదా ముచ్చట్లు పెట్టారు.
ఎక్కువగా అఖిల్ మరియు అభిజిత్ ల గురించి ఆ నలుగురు మాట్లాడటం జరిగింది.అభిజిత్ ను ఆకాశానికి ఎత్తినట్లుగా మాట్లాడిన ఆ నలుగురు అదే సమయంలో అఖిల్ విషయంలో మాత్రం కాస్త డౌన్ అయ్యేలా కామెంట్స్ చేశారు.
ముఖ్యంగా అఖిల్ పులిహోరా రాజా అంటూ చాలా విషయాలను మళ్లీ గుర్తు చేసే ప్రయత్నం చేశారు.

ఆ విషయాలు తనకు గ్రాఫ్ పెరిగుతుందని అఖిల్ భావించాడు.కాని సోషల్ మీడియాలో వినిపిస్తున్న పుకార్లు చూస్తుంటే అఖిల్ గ్రాఫ్ కిందకు పడి పోయినట్లుగా చెబుతున్నారు.అఖిల్ టాప్ 3 లో నిలిచే అవకాశం ఉందని అంతా భావించారు.
కాని అనూహ్యంగా అఖిల్ గ్రాఫ్ పడిపోతుంది.వచ్చే ఆదివారం జరుగబోతున్న ఫినాలే కోసం బిగ్ బాస్ ఇప్పటికే ఏర్పాట్లు చేస్తున్నారు.
ఈ సమయంలో బిగ్ బాస్ మాజీ కంటెస్టెంట్స్ ను ఇంట్లోకి పంపించడంతో అఖిల్ యొక్క గ్రాఫ్ పడిపోయింది అంటూ అఖిల్ అభిమానులు సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు.ఇది వారు కావాలని చేశారో లేదా అనుకోకుండా జరిగిందో తెలియదు కాని అఖిల్ విషయంలో మాత్రం అన్యాయం జరిగినట్లుగా విమర్శలు వస్తున్నాయి.