టాలీవుడ్ ఇండస్ట్రీలో( Tollywood industry ) అతి చిన్న వయసులో హీరోయిన్ గా అడుగుపెట్టి తన అందాలతో ఫిదా చేసిన ముద్దుగుమ్మ శ్రీలీల( Sreeleela ).ప్రస్తుతం చేతి నిండా వరుసలతో ఈ ముద్దుగుమ్మ టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది.
ఇక ఈ బ్యూటీ సోషల్ మీడియాలో కూడా బాగా యాక్టివ్ గా ఉంటుంది.శ్రీలీల తొలిసారిగా ముద్దు అనే కన్నడ సినిమాతో 2019లో అడుగు పెట్టింది.
ఈ సినిమా మంచి సక్సెస్ కావడంతో అదే ఏడాది మరో అవకాశాన్ని కూడా అందుకుంది.ఆ తర్వాత టాలీవుడ్ దర్శకనిర్మాతల కళ్ళల్లో పడటంతో 2021 లో పెళ్లి సందD( Pelli sandadi movie ) సినిమాతో తెలుగు ప్రేక్షకుల మనసులు దోచుకుంది.
ఈ ఒక్క సినిమాతో టాలీవుడ్ లో ఓవర్ నైట్ స్టార్ గా మారింది.ఇక గత ఏడాది మాస్ మహారాజ్ రవితేజ నటించిన ధమాకా( Dhamaka movie ) సినిమాలో హీరోయిన్ గా నటించగా చాలావరకు ఈ సినిమాతో ఈమె లైఫ్ క్లోజ్ అవుతుంది అని అందరూ అనుకున్నారు.

ఎందుకంటే అతి చిన్న వయసులోనే స్టార్ హీరో సరసన నటించడంతో బ్యూటీకి అవకాశాలు వస్తాయా రావో అన్న ఆలోచనలు అందరిలో ఎదురయ్యాయి.కానీ ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ సొంతం చేసుకోవడంతో శ్రీ లీల క్రేజ్ మరింత పెరిగిపోయింది.ఓవర్ నైట్ స్టార్ గా మారిపోయింది.దీంతో ఈ బ్యూటీపై తెలుగు దర్శకనిర్మాతలు కన్ను వేశారు.అప్పటికే పలువురు దర్శకులు ఈమెతో రెండు మూడు సినిమాలు ఫిక్స్ చేశారు.
ప్రస్తుతం అవి షూటింగ్ బిజీలో ఉన్నట్లు తెలుస్తుంది.
ఇక రీసెంట్ గా మరిన్ని సినిమాలు యాక్సెప్ట్ చేయగా మొత్తం 12 సినిమాలు ఆమె ఖాతాలో ఉన్నాయి.అందులో బాలకృష్ణ, మహేష్ బాబు, పవన్ కళ్యాణ్, విజయ్ దేవరకొండ, వైష్ణవ్ తేజ్ ఇలా వరుసగా స్టార్ హీరోల సినిమాలలో అవకాశాలు అందుకొని బాగా బిజీగా మారింది.
ఇక ఈ బ్యూటీ సోషల్ మీడియాలో కూడా బాగా సమయాన్ని గడుపుతూ ఉంటుంది.నిత్యం తనకు సంబంధించిన ఫోటోలను, సినిమా అప్డేట్లను పంచుకుంటూ ఉంటుంది.
ఇక చూడటానికి చాలా అందంగా ఉండే ఈ ముద్దుగుమ్మకు కుర్రాళ్ళు ఫిదా అవుతూ ఉంటారు.అయితే ఇదంతా పక్కన పెడితే తాజాగా తన తల్లి కోసం తను ఒక పని చేయాలని ఫిక్స్ అయింది.

అదేంటంటే ఇకపై తను బోల్డ్ సీన్స్ లో నటించటానికి సిద్ధంగా లేదని తెలిసింది.లిప్ లాక్స్.బెడ్ సీన్స్ చేయను అంటూ రూల్ పెట్టుకుందని తెలిసింది.కారణం తను చిన్న వయసులోనే ఇంత హాట్ గా ఎక్స్ప్రెషన్స్ ఇస్తూ ఉండడంతో సోషల్ మీడియాలో బాగా ట్రోల్స్ ఎదుర్కొంటుంది.
ఇక తననే కాకుండా తన తల్లిని కూడా బాగా ట్రోల్ చేస్తున్నారు.నీ బుద్ధిలే వచ్చాయి అంటూ తన తల్లిపై బాగా కామెంట్లు చేస్తున్నారని తెలిసింది.దీంతో తన తల్లి పరువు కాపాడడానికి కోసం ఈ నిర్ణయం తీసుకుందని తెలిసింది.ఇక ఈమె ఈ నిర్ణయం తీసుకోవడంతో అభిమానులు తొందర పడుతున్నావు.
ఫ్యూచర్ గురించి ఆలోచించి కాస్త నిర్ణయం తీసుకో అంటూ సలహాలు ఇస్తున్నారు.







