నన్ను క్షమించండి,చాలా పెద్ద తప్పు జరిగింది: శ్రీకాంత్ అయ్యంగార్

తెలుగు ప్రేక్షకులకు నటుడు క్యారెక్టర్ ఆర్టిస్ట్ శ్రీకాంత్ అయ్యంగార్( Srikanth Iyengar ) గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.

తెలుగులో చాలా సినిమాలలో నటించి నటుడిగా క్యారెక్టర్ ఆర్టిస్టుగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.

అలా తెలుగులో మోస్ట్ వాంటెడ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మారిపోయారు.ఈ మధ్యకాలంలో విడుదల అయ్యే చాలా సినిమాలలో ఆయనను మనం చూస్తూనే ఉన్నాం.

చాలామంది డైరెక్టర్లు ఆయన తప్పనిసరిగా ఉండాల్సిందే అన్నట్టుగా కథలను రాసుకుంటున్నారు.

బ్రోచేవారుఎవరురా, సామజవరగమన, భలే ఉన్నాడే, సరిపోదా శనివారం, తాజాగా విడుదలైన పొట్టేల్ సినిమాలో( Pottel Movie ) కూడా నటించి మెప్పించారు శ్రీకాంత్ అయ్యంగార్.ఇది ఇలా ఉంటే పొట్టేల్ సినిమా విడుదల ఈ మంచి సక్సెస్ను సాధించిన సందర్భంగా తాజాగా మూవీ మేకర్స్ సక్సెస్ మీట్ ను వహించారు.అయితే సక్సెస్ మీట్ లో భాగంగా ఆయన మాట్లాడుతూ.

Advertisement

రివ్యూ రైటర్ల( Review Writers ) మీద అనుచిత వ్యాఖ్యలు చేశారు.ఆ తరువాత సినీ జర్నలిస్టుల నుంచి నిరసన వ్యక్తం కావడంతో రివ్యూయర్స్ పై తాను చేసిన వ్యాఖ్యలపై నటుడు శ్రీకాంత్‌ అయ్యంగార్‌ స్పందించారు.

అయితే త్వరలోనే క్షమాపణలు చెబుతాను అంటూ వీడియోని కూడా విడుదల చేశారు.కొన్ని మాటలు అని కొంత మందికి బాధ కలిగించాను.త్వరలో అందరికీ కరెక్ట్‌ విషయాలపై బేషరతు క్షమాపణలు చెబుతా, దయచేసి వేచి ఉండండి అని వీడియోలో పేర్కొన్నారు శ్రీకాంత్.

ఆ వీడియో రిలీజ్ చేసి చాలా కాలమైంది అయినా ఇప్పటివరకు క్షమాపణలు చెప్పలేదు.ఇక తాజాగా నిన్న రాత్రి ఆయన మరో వీడియో రిలీజ్ చేశారు.

ఆ వీడియోలో ఆయన మాట్లాడుతూ అందరికీ నమస్కారం నేను మీ శ్రీకాంత్ భారత్, కొన్ని రోజుల క్రితం క్షమాపణ కోరుతున్నాను అని చెప్పి త్వరలో విడుదల అని చెప్పాను.నన్ను ప్లీజ్ క్షమించండి, చాలా పెద్ద తప్పు జరిగిపోయింది అండి నేను ఇంకా బేషరతు క్షమాపణ కోరలేదు ఆ వీడియోలో చెప్పుకొచ్చారు శ్రీకాంత్ అయ్యంగార్.

ఇప్పటికైనా రోటీన్ సినిమాలను చేయడం ఆపకపోతే తెలుగు ఇండస్ట్రీ పరువు పోతుందా..?
Advertisement

తాజా వార్తలు